అతడు సకృత్తుగా ఇంట్లో కాఫీ పుచ్చుగున్నా, విధిగా బయట కతికి తీరతాడు. అతని మహిమవల్ల అతనికి ప్రతీ హోటల్లోనూ కాతాయే. ఏదేనా పాత కాఫీ హోటల్లో తను ఇవ్వదేలిన బాకీ మొత్తం బాగా ముదరబారినప్పుడు, ఆయన శ్రేణికి వెళ్ళడం మానెయ్యవలసిన అవసరం వస్తూండబట్టి, ప్రతీ కొత్త కాఫీ హోటల్లోనూ వారిదే శ్రీ సుపుత్రుడు ఇల్లటపల్లుడు. అతని అత్తారి కుటుంబంలో ఎవరికో మందిప్పించుగోడానికి వారంతా స్వగ్రామంనించి పట్నం వెల్తు అతణ్ని విడిచి పెట్టలేక కూడగట్టుకెళ్ళడంవల్ల అతడు ప్రస్తుతం పట్నంలో ఉన్నాడు. సుబామ్మ గారు తన కొడుకుతో గాని, కోడలితో గాని కాల యాపనకోసం మాటా తిట్టూ ఆడుకుంటూ మహధ్వజాయంగా ఉపన్యాసం ఉరిమేటప్పుడుగాని కనిపించదు. మొత్తంమీద అప్పుడు ఇంట్లోను భార్య ఒకర్తే ఉంటా. కొంతసేపటికి మెల్లాలోకి వచ్చి ఒక గ్లాసూ, పప్పుగిన్నీ, చమ్చా వగైరాలు చప్పుడు కాకుండా స్వామిలారి దగ్గిర పెట్టి లోపలికి వెళ్ళింది. స్వాములారు చుట్టుపక్కల అయ్యే అలికిడి కూడా చెవిని పట్టని యోగంలో ఉంటూన్నప్పటికీ, తనదివ్య జ్ఞానమహిమ వల్ల, కాఫీ పరికరాలు తన సాన్నిధ్యానికి అరుగుదెంచడం పోల్చాడు. తక్షణమే కళ్ళునిప్పి, వేళ్ళ సంధులు బెట్టించి, ఆవిలించి చిటిగేసి గొంతుక బాగుపడే నిమిత్తం దీర్ఘంగా సకిలించి, గుటకేసి "నారాయణ" అనుకొని- ఆయన గ్లాసులో ఉన్న పాలుపోసి ఆ పప్పు గిన్నెలో ఆ యొక్క క్షీరకషాయ సమ్మేళన మహోత్సవ వైభవం చేతులారా జరుపుతూ కళ్ళారా చూస్తూ ఉన్నాడు. నవ నవోదయందాలుస్తూ, సకల కశ్మల హరమై ఒప్పేటటువంటి ఏ తత్కా ఫీ ద్రావక. గంధం వారినాసికాగ్రాన్ని డీక్కునేసరికి వారికి నోరూరి, నాలిక జలడి, వాగ్ధార ప్రవహించేటంత పనీ జరిగింది. కాని సుభార్య గారు క్షణానికోమాటు ఉహు ఎగపీలుస్తూండడం, నిరంతరం ఉహు చీత్తూండడం కూడా స్వాములారికి ఇంట్లోంచి వినిపిస్తున్నాయేమో, ఇంతా ముస్తాబు చేసుకుని తయారైన వారియొక్క లెక్చరు దేవి వేషం తీసేసి వెనక్కి వెనక్కి అణగారడం మొదలెట్టింది. అయినా సరే, ఆవిడ దుఃఖానికి కారణం ఏమిటో గమనించితీరాలనే బుద్ధి ఆయన్ని వదలకుండా పట్టుకోడం వల్ల. ఆయన కావలసిన పంచదార పక్కనే ఉన్నట్టు చూసి కూడా, అడిగీ అడగనట్టు- "అమ్మా! కాస్త పంచదార!" అని "ఓహో! ఇక్కడ పెట్టేశారా! మరి తేనక్కరలేదు, తల్లీ!" అన్నాడు. (మహా అక్కడికి, తను కేకేసిన దరిమిలానే అది తన కంటపడ్డట్టు!) ఇలాంటి ఆర్దకుసిపరామర్శ తనకి నచ్చక గావును, సుభార్య తన మూగనోములోనే ఉండిపోయింది. దాంతోటి స్వాములవారు తప్పకుండా ఏదో కమామిషు వుందనుకొని, ఒక చిన్న “తనలో" (అనగా స్వగతం) ప్రారంభించారు: "క్షీరం బ్రహ్మ, చక్కెర ప్రకృతి కషాయం జీవుడు. కాఫీ ద్రావకం స్వయంగా సృజన గావించుకొనే భక్తకోటికి ఆ యొక్క ప్రకృతి జీవ
పుట:నామీదేనర్రోయ్ (కథలు).pdf/2
స్వరూపం