పుట:నాగార్జున కొండ.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉనికి, ప్రాముఖ్యము

3

సుప్రసిద్ధమైన బౌద్ధతీర్థం ఒకటి ఉండేది. ఇక్కడ అంతకుపూర్వమే బుద్ధుడి ధాతువుమీద నిర్మించబడిన మహాచైత్యం ఉండేది. అది ఖిలం అయిపోతే ఇక్ష్వాకు రాజులకాలంలో దానిని జీర్ణోద్ధారం చేసి, దానికి చక్కని శిల్పాలుగల చలవరాతి పలకలు మలిచారు. చైనా, సింహళం మొదలయిన దూరదేశాలనించి అనేకమంది బౌద్దులు ఇక్కడి తీర్థాన్ని దర్శించడానికని యాత్రలు చేశారు.

ఈ విధంగా చెట్లు చేమలతోటీ, వన్యమృగాలతోటీ భయంక రంగా ఉంటూ వచ్చిన ఈ నాగార్జునకొండలోయ ఒక్కసారిగా తన పూర్వవైభవాన్ని బయలుపరచింది. ఇక్కడికి దగ్గరలోనే నంది కొండవద్ద ప్రభుత్వంవారు కృష్ణకి అడ్డంగా ఒక కట్ట నిర్మిస్తు న్నారు. దీనికి ఫలితంగా కృష్ణ నీరు పైకి ఎగతన్ని నాగార్జునకొండ, లోయ యావత్తునూ ముంచివేస్తుంది. అందుకని ప్రభుత్వంవారు ఈలోయ అంతటా ఖననపరిశోధన సాగించి ఇక్కడి ప్రాచీ నావ శేషములనన్నిటినీ బయటికి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు.