ఈ పుట ఆమోదించబడ్డది
34
నాగార్జున కొండ
అతిముఖ్యమైన నాగార్జునకొండలోయ కృష్ణా గర్భంలో లీనమయి పోతూంది. బుద్ధభగవానుడి ధాతువుమీద కట్టబడిన పవిత్రమహా చైత్యం మనకి కనుపించదు. బోధిసత్వ నాగార్జునుడి విద్యాపీఠం కనుమరుగై పోతుంది. ఇక్ష్వాకు చక్రవర్తుల రాజధానిగా కీర్తి చెందిన విజయపురి అదృశ్యమైపోతుంది. ఈ పవిత్రనిర్మాణాలూ, స్థలాలూ భావుకులైన వారి హృదయఫలకాలమీదనూ, మనో వీధులలోనూ మాత్రం నీలిచి వుంటాయి.