పుట:నాగార్జున కొండ.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనములు

నాగార్జునకొండలోయలో జరిగిన ఖనన పరిశోధనలో కట్టడములతోటీ, శిల్పాలతోటీపాటు ఎన్నో శాసనములుకూడా దొరికినవి. ఈ శాసనములవల్లనే మనకుఈ కట్టడములము గురించి, ఇక్ష్వాకు రాజులవి గురించి ఆనాటి బౌద్ధమతాన్ని గురించి వివరాలు తెలియవస్తాయి.

ఈ శాసనాలు చూడడానికి ముచ్చటగా వుండే లిపిలో వ్రాయబడినవి. ఈ లిపికి బ్రాహ్మీలిపి అని పేరు. ఈ శాసనాల భాష ప్రాకృతం. ఈ ప్రాకృత భాష సంస్కృతానికి చాలా దగ్గ రగా వుంటుంది. ఈ శాసనాలలో సామాన్యంగా హ్రస్వాక్షరాలు ఎక్కువగా వుంటాయి. అలాగే ద్విత్వాక్షరాలకి బదులుగా 'రెండేసి అక్షరాలు ఉంటాయి. (ఉ. శ్రీకి బదులు సిరీ; స్తంథకిబదులుత భౌ).

నాగార్జునకొండలో దొరికిన శాసనాలు Epigraphia Indica అనే పత్రిక XXవ సంపుటము 1-87 పుటలలోనూ, XXI వ సంపుటం 61.71 పుటలలోనూ, XXIX వ సంపుటము 137-130 పుటలలోనూ, నాగార్జునకొండసంచిక 32-34 పుటల లోనూ మూలపారములతోటీ, వ్యాఖ్యానములతోటి ప్రకటించ బడినవి. ఇవి మొత్తం 44 శాసనాలు ఉన్నవి.