పుట:నాగార్జున కొండ.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక్ష్వాకురాజులు

9


ఇక్ష్వాకువంశంలో నలుగురు రాజులు స్వతంత్రులుగా పరి పాలన చేశారు. వారిలో మహారాజ వాసిష్ఠీపుత్ర చాంతమూలుడు మొదటివాడు. ఇతనిని మొదటి చాంతమూలుడనికూడా వ్యవహ రిస్తారు. ఇతనికి చాంతిశ్రీ, హమ్మశ్రీ అని యిద్దరు సోదరీలు ఉండేవారు. ఈ రాజు భార్య మాఢరీదేవి. మొదటి చాంతమూలుడికి మహారాజ శ్రీవీరపురుష దత్తుడనే కుమారుడు, అడవి చాంతిశ్రీ అనే కుమార్తె ఉండేవారు. ఇందులో పురుషదత్తుడు ఉజ్జయినీ రాజపుత్రిక అయిన రుద్రధర భట్టారికను, భటిదేవను, తన మేనత్తల కుమార్తెలు ముగ్గురినీ వివాహం చేసుకున్నాడు. ఇతనికి మహారాజ ఏహువుల చాంతమూలుడనే కుమారుడూ కొడబలిశ్రీ అనే కుమార్తె వుండేవారు. వీరిలో కొడబలిశ్రీ వన వాసిమహారాజును వివాహం చేసుకున్నది. ఇక్ష్వాకుల ఆడపడుచులు కొందరు ధనకులు, పూగియులు అనే తెగలవారికి కోడళ్లుగా వెళ్లారు. ఇక్ష్వాకువంశంలోని కడపటిరాజు శ్రీరుళుపురుషదత్తుడు.

ఇక్ష్వాకు వంశీయులు 100 సంవత్సరములు పాలించినట్లు కొన్ని చోట్లను, 52 లేక 50 సంవత్సరములు పాలించినట్లు కొన్ని చోట్లను పురాణములలో చెప్పబడి ఉన్నది. ఈ రెండు కాలపరి మితులూ సరియైనవే కావచ్చును. ఈ రాజుల శాసనములను బట్టి వీరు 35 సంవత్సరములైనా పరిపాలించినట్లు తెలుస్తూంది. మొదటి చాంతమూలుడు ఎంతకాలం ఏలినదీ సరిగా తెలియదు. (అతడు 16, 17 ఏళ్ళు పాలించి ఉండవచ్చును. ఇక మిగిలిన 50 సంవత్సరములూ ఇక్ష్వాకులు సాతవాహనులకు సామంతులై మహా