పుట:నాగార్జున కొండ.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

నాగార్జున కొండ

వల్ల తెలియవచ్చే ఇక్ష్వాకువంశీయులని చరిత్రకారులు నిర్ణ యించారు.

ఇక్ష్వాకువంశం చాలా ప్రాచీనమైనది. వేదవాజ్మయం లోనూ, పురాణములలోనూ ఈ వంశం ప్రశంస ఉన్నది. ఈ వంశపు రాజులు అయోధ్యా, మిథిలా, వైశాలీలవంటి కేంద్రాల నించి రాజ్యం చేశారు. ఈ వంశీకులు అనేకమంది దక్షిణాపథానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడి కొన్ని రాజ్యాలు స్థాపించుకున్నారు. వీరిలో కొందరు ఆంధ్రులలో కలిసిపోయి, క్రమక్రమంగా దక్షిణంగా వ్యాపించి, సాతవాహనసామ్రాజ్యం వైభవంగా సాగుతూన్న కాలంలో నాగార్జునకొండప్రాంతంలో స్థిరపడ్డారు. క్రీ. శ. 2వ శతాబ్దిలో ఈ వంశీకులలో కొందరు ప్రబలులై సాతవాహన చక్రవర్తులకు మహాతలవరు లనే పేర సామంతులుగా ఉండేవారు, క్రీ. శ. మొదటి పాదాంత్యంలో సాతవాహన సామ్రాజ్యం క్షీణించింది. నాలుగవ పులోమావి అనే రాజు మరణించడంలో అది అంతరించింది. ఆమీద సామంతులు స్వతంత్రులయారు. రాజవంశం యొక్క వివిధశాఖలవారు ఎక్కడివారు అక్కడ స్వతంత్రులై. ఎవరికి దొరికిన భూమిని వారు ఆక్రమించి స్వతంత్రంగా పాలిస్తూ వచ్చారు. ఈ సమయంలో వాసిష్ఠీపుత్ర చాంత మూలుడనే ఇక్ష్వాకు వంశీయుడు విజృంభించాడు. సామంతమండలీకులు కొంత మందిని కూడగట్టుకుని ఇతడు దిగ్విజయం ప్రారంభించి, మిగిలివున్న సాతవాహన వంశీయులందరినీ జయించి స్వతంత్ర రాజ్యస్థాపన చేశాడు.