పుట:నాగార్జున కొండ.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

నాగార్జున కొండ

ఈ బౌద్ధాచార్యుడు భార దేశపు తాత్త్వికులలో అగ్రశ్రేణికి చెందినవాడు. ఇతడు వైద్యశాస్త్రంలో మంచి ప్రావీణ్యం సంపాదించి సుశ్రుతమనే ఆయుర్వేద గ్రంధానికి వ్యాఖ్యానం వ్రాశాడు. ఇతనికి రసాయనశాస్త్రంలో చక్కని ప్రవేశం ఉండేది స్వర్ణ యోగం కని పెట్టి ఇతడు రాళ్ళను బంగారంగా మార్చాడట !

' యజ్ఞశ్రీ చక్రవర్తి ధాన్యకటకం (అమరావతి) లోనూ, బోధిసత్వ నాగార్జునుడు శ్రీపర్వతం (నాగార్జునకొండ) మీదనూ నివ సిస్తూ, ఇద్దరూ మిత్రులై చాలా సన్నిహితులుగా ఉండేవారు. ఈ బౌద్ధాచార్యుడి ప్రేరణవల్లనే జగత్ప్రసిద్ధమైన అమరావతీ మహా చైత్యానికి లోకోత్తరమురైన శిల్పములతో అలంకరింపబడిన ప్రాకారం నిర్మించబడింది.

ఈ విధంగా శ్రీపర్వతంమీద నివసించి బోధిసత్వ నాగార్జునుడు నాగార్జునకొండలోయనీ, యావదాంధ్రదేశాన్ని కూడా పవిత్రం చేశాడు.