పుట:నాగార్జున కొండ.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2 నాగార్జునుడు, నాగార్జున కొండ

ఈ నాగార్జునకొండలోయలో కృష్ణ ఒడ్డున నాగార్జునకొండ అనే పేరుగల పెద్దకొండ ఒకటి ఉన్నది. ఈ కొండకి ఈ పేరు నాగార్జునుడనే వ్యక్తినిబట్టి వచ్చి ఉంటుంది. ఈ కొండకి ఈ పేరు చిరకాలంనించీ ఉంటూ వస్తున్నది. అందువల్ల నాగార్జునుడి సంబంధాన్ని గురించి ఇక్కడ సంగ్రహంగా చెప్పడం ఉచితం. బౌద్ధుల వాజ్మయంలోనూ, గాథలలోనూ నాగార్జునుడి పేరు తరుచుగా కనిపిస్తుంది. ఈ ప్రశంస చైనా, టిబెటు దేశాలలో ఎక్కువగా ఉన్నది. నాగార్జునుడనే పేరుగల వ్యక్తులు ఇద్దరు ఉండేవారు. అందులో ఒక నాగార్జునుడు క్రీ. శ. 2వ శతాబ్దిలో ఆంధ్రసాతవాహనచక్రవర్తి అయిన యజ్ఞశ్రీ సొతకర్ణి సమకాలి కుడుగా వుండేవాడు. రెండవ నాగార్జునుడు క్రీ. శ. 6వ శతాబ్దిలో ఉండేవాడు. ఇద్దరూ ఆంధ్రదేశంలో బౌద్ధమత ప్రచారం చేశారు మొదటి నాగార్జునుడు నాగార్జున జోధిసత్వుడనీ, నాగార్జున పూస అనీ చాలా ప్రసిద్ధి కెక్కాడు. విదేశాలలో ఈ మహా నీయుడు బుద్ధుడి తరువాత మళ్ళీ అంతటి వాడని కీర్తి చెందాడు టిటెటు దేశంలోని ఒక గాథననుసరించి ఇతడు శ్రీపర్వతముమీద నివసించినట్లు తెలియవస్తుంది. ఈ శ్రీపర్వతమనే పేరు నాగార్జుని