పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శతజయంతి నివాళి

చిరస్మణీయుడు, తెలుగు భాషోద్యమకారుడు

తమ్మారెడ్డి కృష్ణమూర్తి

గారు

2013లో తనువు చాలించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తిగారికి ఈ ఏడు సెఫ్టెంబరు16కు వందేళ్ల పండుగ జరగాల్సి ఉంది. అయితే ఆయన 93 ఏళ్ళకే సెలవు తీసుకొన్నారు. ఆయన కనుమరుగుకు ఐదేళ్ల ముందు 'నేనూ నా జ్ఞాపకాలు” అనే 116 పుటల పుస్తకాన్ని ప్రచురించారు. అందులో తన అనుభాలను అభిప్రాయాలనూ, ఆశలనూ, ఆకాంక్షలనూ వెల్లడించారు. తన మధుర స్పృతులను నెమరు వేసుకొన్నారు.

ఆ పుస్తకాన్నంతా చదివివేసరికి నాకు ఆపెద్దాయన పూర్ణవ్యక్తిత్వం కళ్లకు కట్టినట్లనిపించింది. నాకు ఆయన పరిచయం 2003లో-తెలుగు భాషోద్యమ సమాఖ్యను అందరం కలసి స్థాపించడానికి కొద్ది నెలల ముందు నుంచే కలిసి పనిచేయడంతో నాకు ఆయన అంటే ఎంతో గౌరవం ఏర్పడింది. వారి సినిమాలను చూసినప్పుడు సమాజానికి పనికొచ్చే మంచి సినిమాల నిర్మాతగా ఆయన పట్ల నాలో ఏర్పడిన గౌరవం ఎన్నోరెట్లు పెరిగి, ఆయనతో సాన్నిహిత్వానికి దారి తీసింది. ఎంతో ఆలోచనతో, ప్రేమతో మాట్లాడే తీరు, అంత పెద్ద వయస్సులో ఆయనలో కనిపించే ఉద్యమ స్పూర్తి, ఆచరణా నాకెంతో స్ఫూర్తిదాయకంగా ఉండేది. కృష్ణమూర్తిగారి కంటే నేను 25 ఏళ్లు చిన్నవాణ్ణి.

తన పుస్తకం మొదటిలోనే 'మనసులో మాట' అంటూ ఇలా వ్రాసుకొన్నారు: “ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, ఎవరి ఆసరా లేకుందా చిన్నప్పట్నుంచీ అంటే విద్యార్థి దశనుండీ, స్వయంకృషితో యొన్నెన్నో ఆటుపోట్లను యెదుర్శొని, మృత్యుముఖం చేరి, అద్బష్టవశాళ్తు తప్పించుకొని, మద్రాసు మహానగరంచేరి, సినీరంగ ప్రవేశం చేసి దాదాపు ఒక పుష్మరకాలం సినీరంగానికి వెందిన పలు అంశాలను అధ్యయనం చేసి ఆకళింపు చేసుకొని, శ్రేయోభిలాషుల ఉత్సాహ ప్రోత్సాహాలతో సుమారు ఓ డజను చిత్రాలు నిర్మించి, తెలుగు చలనచిత్ర చరిత్రలో నాకో సముచిత స్థానాన్ని సంపాదించుకొన్నాను అన్న తృప్తి నాకుంది.”

ఆ పున్తకంలో కృష్ణ మూర్తి గారు వ్రాసుకొన్న 'మాతృభాషాసమితి' అనే వ్యాసాన్ని తెలుగు భాషోద్యమం పట్ల ఆసక్తి ఉన్నవారంతా తప్పక చదవాలి.

అందులోనీ కొన్ని మాటల్ని ఇక్కడ ఉటంకిస్తాను. “నా జీవితానుభవంలో అ(గస్టానంలోనిది అని నేను భావించుకొని, ఆనందించే మథుర స్మృతులలో తెలుగుపట్ల ఏదో తెలియని మమకారంతో దాని వ్యాప్తి కోసం సేవ చేసే భాగ్యం కలగడం ఒకటి. నాకు అభిరుచి ఉన్న అంశాలలో ముఖ్యమైనది సామాజిక ఉద్యమాలలో పాల్గొనడం... ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలుగు భాషా చైతన్యోద్యమంలో పాల్గొనడం ఒక్కటీ ఒక ఎత్తు.

“ఆ ఉద్యమంలో నేను ముందుండటాననీ ప్రకటించాను. అప్పటి నుంచి నేను మాతృభాషా సమితి కార్యక్రమాలలో నిమగ్నమైపోయాను. ప్రొఫెసర్‌ ఎన్‌.ఎస్‌.రాజు గారు 'తెలుగును కాపాడుకొందాం, అది మనల్ని కాపాడుతుంది” అనే చిన్న రచన ద్వారా ఇప్పటి తెలుగుస్థితి, తెలుగు వాడకం తగ్గడం వల్ల సమాజానికి ఖాషా ఉద్యమానికి ఒక శాస్త్రీయ ప్రతిపాదనలను ప్రకటించారు. అది నన్నెంతో ఆకర్షించింది. ఆ నేపథ్యంతోనే ఇప్పటి తెలుగు భాషా చైతన్యోద్యమం పుట్టింది. వివిధ పత్రాలను, ప్రభుత్వానికి ప్రతిపాదనలను రాజుగారు తయారు చేశారు. వాటిలో ప్రభుత్వ కర్తవ్యాన్ని సూచించారు. ఈ భూమిక మీద మేం అప్పటి విద్యామంత్రికీ ముఖ్యమంత్రికీ విజ్ఞప్తులు చేశాం. రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలసి అప్పటి ముఖ్యమంత్రికి తెలుగును అధికార భాషగా అమలుచేయాలని, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని ప్రోత్సహించాలని, తెలుగుభాషకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చెయ్యాలని, సుప్రసిద్ధ భాషావేత్త గిడుగు రామమూర్తిగారి జయంతిని తెలుగుభాషా దినోత్సవంగా జరపాలని విజ్ఞప్తి చేశాం. తెలుగు భాషా చైతన్య సమితి సుమారు పదేళ్ళపాటు చేసిన కృషి ఇప్పుడు మన రాష్ట్రంలో తెలుగు భాషా వాతావరణం పెరగడానికి పునాది అయింది. దానీ నిర్మాణంలో నేను ఒకడిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. 'తెలుగు భాషాచైతన్య సమితి గౌరవాధ్యక్షునిగా పనిచేయడం, తెలుగు భాషోద్యమ సమాఖ్యకు సలహాదారుగా వుండటం "నాజీవితంలోని కొన్ని ముఖ్యఘట్టాలు”. అని ఆయన ప్రకటించారు.

తమ్మారెడ్డి కృష్ణమూర్తిగా ఆయన ప్రఖ్యాతులైనా ఆయన పూర్తిపేరు “తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి". తెలుగు చిత్ర నిర్మాణ రంగంలో ఆయన వారసత్వాన్ని ఆ గౌరవాన్ని కాపాడుతూ ఆయన పెద్ద కుమారుడు భరద్వాజ గారు నిరంతరం కృషిచేస్తూ ప్రతిష్టను సంపాదించారు.

తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారితో కలిసి అత్యంత సన్నిహితంగా భాషోద్యమ రంగంలో పనిచేసిన తెలుగు సినీరంగ ప్రముఖులు కె.బి. తిలక్‌ గారూ, కీ.శే. ఎం.ఎస్‌ రెడ్డి గారు, వారితో పాటు అండగా నిలబడ్డ మరో మరపురాని వ్యక్తి ముద్రణారంగంలో ప్రఖ్యాతులైన క్రీ.శే పరుచూరి హనుమంతరావు గారు.

తమ్మారెడ్డి కృష్టమూర్తి గారి శతజయంతి సంవత్సరం సందర్భంగా ఆయనకు తెలుగు భాషోద్యమ సమాఖ్య తరఫునా భాషోద్యమంలో పాలు పంచుకొంటున్న అందరి తరఫునా అంజలి ఘటిస్తున్నాను.

- సామల రమేష్‌బాబు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి

నవంబరు-2020

9