పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అన్నారు. “ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత, నిద్రఫోవాలని చెప్పి ఆయన్ని సాగనంపేశారు. “అవును, నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా అవసరం” అంటూ ఆయన వెల్లిపోయారు. అలా అనడం మర్యాద. నౌకర్లు కూడా భోజనానికి వెళ్లేముందు “అన్నం తినడం మనీషికి చాలా అవసరం, ఒంటికి మంచిది కూడా” అని చెప్పి సెలవు తీసుకుంటారు.

రాజుగారు భోజనం పంపారు. ఆమె తనకు కావలసిన ప్లేట్లు, ఫోర్కులు, కత్తులు, బెడ్‌, బీరు తన వెంట తెచ్చుకొన్నది. అవన్నీ తెచ్చుకోవలసినదిగా రాజాగారే కోరారు. భోజనంతోపాటు ఆకులు వేసిన ఇత్తడి పళ్లాలు పంపారు. భోజనానీకి పలావు, ఆవగాయలు, పదిపన్నెండు రకాల పచ్చళ్లు, రకరకాల కాయగూరలు, కేకులు వచ్చాయి. “ఈ రాజాగారి స్థాయికి చెందిన బ్రాహ్మణులు ఎప్పుడూ అరటాకుల్లోనే భోజనం చేస్తారు.”

భోజనానంతరం ఊరు చూద్దానికి అతిథుల్ని తీసుకెళ్లారు, మేళతాళాలతో. జడ్డ్దదంపతులు పల్లకీలో, రాజుగారు సింహాసనం లాంటి కుర్చీలో కూర్చొని ఊరేగారు. ఊరు ఊరంతా ఆ ఉత్సవం చూడడానికి తరలివచ్చింది. పల్లకీ తలుపు కాస్త మూసివుండేసరికి, రాజాగారు గబగబా వచ్చి ఆ తలుపు తెరిచి, ప్రజలకు దర్శనమివ్వవలసినదని ఎ-ని ప్రాధేయపడ్డారు.

ఊళ్లో అన్నీ మట్టి యిళ్లే. ఎవో కొన్ని మంచి యిళ్లు తప్ప, వేటికీ వెల్లకూదా వెయ్యలేదు. వీధుల్లో మడిమల్లోతు బురద. అంత మురికిలో కూడా అక్కడక్కడా ఆపాదమస్తకం ఆభరణాలు ధరించిన స్రీలు, కాశ్మీరు శాల్వలు కప్పుకొన్న పురుషులు ఆ మట్టి యిళ్లలోంచి తొంగి చూసే వాళ్లు, ఆడంబరం, పేదరికం పెనవేసుకోపోవడంలా వుండేట్లుంది వాళ్లను చూస్తే!

ఒక దేవాలయానికి తీనుకెళ్లారు. ఆమె ఇది వరకెన్నడూ దేవాలయం చూడలేదు, లోపల ఏముందో చూడాలని ఆసక్తి. “మొదట పెద్ద ఆవరణ, చుట్టూతా ఎత్తైన గోడ. దానికి అన్ని వైపులా పెద్ద పెద్ద ద్వారాలు. గోపురాల్లా ఆ ద్వారాలను చూసి అవే దేవాలయాలను కొనే దాన్ని కానీ అవి ముఖమంటపాలట, ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లగానే విశాలమైన స్థలం చూసి గుడిలోకి వచ్చేశామనుకున్నాను. అదంతా దాటుకొని పోతే లోపల చతురస్రాకారంలో ఒక కట్టడం వుంటుంది. దాని ప్రధాన ద్వారం ఎదుట మండపం - అందులోంచి వెళితే గుడి అదొక అద్భుతమైన స్వప్నమందిరంలా వుంది. బాగా కిందికి వున్న కప్పు, చీకటిలో కలిసిపోయే పెద్ద రాతి స్తంభాలు, గోడలో చక్మని గూళ్లు, అక్కడక్కడా పెద్ద తలపాగాలతో కనిపించే మనుషులు. ఏదో కలగంటున్నట్లు అనిపించే అలాంటి ప్రదేశాన్ని నేనెప్పుడూ చూడలేదు. మధ్యలో గర్భగుడి ముందుకు మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడి నుంచి కాస్త వంగి చూస్తే, లోపల అంతా కనపడేడేగానీ, అలా వోంగితే విగ్రహం ముందు వంగి మోకరిల్లినట్లు అనుకుంటారేమోననీ మానేశాను.” ఊరు చూడ్డం పూర్తయి, ఇంటికి తిరిగి వచ్చేసరికి గుడ్డి దీపాలు వెలుగుతున్నాయి. నాట్యగత్తెల నాట్యం, బాణాసంచా పేల్చడం సాగుతోంది. జనం తండోపతండాలుగా వున్నారు. ఆ వేడి, వెలుతురు, ఆ అరుపులు, ఆర్భాటాలకు తట్టుకోలేక, కాసేపటికి దంపతులు తమ గదులకు వెళ్లారు. గదుల్లో అంతా పాశ్చాత్య


పద్దతుల్లో ఏర్పాట్లు చేశారు. మాటీ (Matee) కొవ్వొత్తులు వెలిగించి, టేబిల్‌ మీద టీ, పుస్తకాలు, డ్రాయింగ్‌ సరంజామా అంతా చక్కగా అమర్చాడు. ఒక్క నిమిషంలో దృశ్యం పూర్తిగా యిలా మారిపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఐతే, మర్నాడు అంతా ఎప్పటి మాదిరి. అంతా స్థానిక పద్దతికి వచ్చేసింది. “ఏనుగు మీద తిప్పండని పంతుల్ని (రాజాగారి అసలు పేరు) అడిగాను. వెంటచే ఏనుగును తెప్పించారు. కానీ దానిపైకి ఎక్కడం కష్టమైంది. పనికిమాలిన నిచ్చెన వేశారు. హోదా కూదా సరిగా లేదు. ఎవరో ఇంగ్లీషువాడు తయారు చేసి యిచ్చాడట. నాసిరకం అంబారీ, దానిమీద ఎక్కి కూర్చోవాలంటే భయం వేసింది. చివరకు ముందు ఏనుగు, దాని వెనక పల్లకీలో కూర్చొని ఆమె రాజాగారి తోట చూడ్డానికి బయలుదేరింది. “దాన్ని రాజాగారు తోట అంటారు. తమలపాకుల తోట, కొబ్బరిచెట్లు, అంతా బురదబురద, మరేమీ లేదు” అంటుంది.

వనవిహారం పూర్తి చేసుకొని యింటికి రాగానే రాజుగారు తన భార్యను ఆమెకు పరిచయం చేశారు. తనకు ఆమెను చూడాలని ఉన్నా ఆయన ఏమనుకొంటారోనని అడగలేక పోయింది. ఈ విధంగా ఆ కోరిక తీరింది. ఎ-గదిలో లేనపుడు రాజాగారు ఆవిడను వెంటపెట్టుకొని వచ్చి పరిచయం చేశారు. అందమైన యువతి. చక్కని ముఖ వర్చస్సు. బంగారు జరీ అంచు పచ్చని చీరకట్టి ఒంటినిండా నగలు, నడుముకు బంగారు నాణేలు పొదిగిన వడ్డాణం పెట్టుకుంది. వెంట వచ్చిన దాసీజనం ద్వారం వద్దనే నిలిచిపోయారు. రాజాగారి గుమాస్తా మాత్రం ఆవిద వెనక నిల్పొని, ఎలా నడుచుకోవాలో చెప్తున్నాడు. జడ్జిగారి జవాన్లలో ఒకడు దుబాసీగా వ్యవహరించాడు. “ఆవిడ వచ్చీరాగానే సిగ్గుతో వంకర్లు తిరిగిపోయి, ఏం చేయాలో తెలియక, నిల్చుండిపోయింది. అప్పుడు గుమాస్తా సలాములు చేసి, కుర్చీలో కూర్చొనవలసిందిగా చెప్పాడు. ఆ తర్వాత నేనూ అలాగే చేశాను. ఒకరి భాష ఒకరికి తెలియదు. రాజుగారి భార్వకైతే ఇంగ్లీషు బొత్తిగారాదు. నాకు జెంటూ (తెలుగు) ఎంతవరకు తెలుసునంటే, మా జవాను మా సంభాషణలను తన యిష్టం వచ్చినట్లు మార్చి, ఒకరినొకరు తెగ పొగిడినట్లు తర్జుమా చేస్తుంటే కనుక్కోగలిగినంత మాత్రం తెలుసు. ఆవిడ బట్టల మీద చాలా ఆసక్తి కనబరచింది. నా టోపీ (Bonnet) చూసి ముచ్చటపడి మునివేళ్లతో తాకింది. ఆవిడకు కొన్ని చిత్రాలు చూపించాను. వాట్ని తల్లకిందులుగా పట్టుకొని చాలా బాగున్నాయని మెచ్చుకొంది. ఎ -గదిలోకి వచ్చేదాకా ఆవిడ చాలా సరదాగా గడిపింది. అనుకోకుండా ఎ - గదిలోకి రాగానే, ఒక్క ఉదుటున లేచి గబుక్కున వెనుదిరిగి గబగబా వెళ్లిపోయింది. అయితే ఎ - ఆవిడను ఇబ్బంది పెట్టడం యిష్టంలేక, నేరుగా లోపలికి వెళ్లిపోవడంతో ఆవిడ మెల్లగా తిరిగొచ్చి, దర్జాగా కూర్చుంటూ ఆయనకు క్క్షమాపణ తెలియజేయమన్నది - “మీరు మా తల్లిదండ్రులతో సమానం” అంటూ కూర్చుంది. అంత కంగారు పడిన ఆవిడ తనవెంట మగనౌకర్లు వుంటే పట్టించుకోలేదని ఆమె ఆశ్చర్యపోయింది.

ఇక్కడ వీళ్లరూ కబుర్లు చెప్పుకొంటుంటే, అవతల గదిలో ఎ -రాజుగారికి మేలుచేసే” విషయాలు బోధించే ప్రయత్నంలో వున్నారు. రాజాగారు అందరు బ్రాహ్మణుల్లా కాకుండా ఎ - చెప్పింది శ్రద్దగా విన్నారని, కొన్ని పుస్తకాలు యిస్తే, తీసుకొన్నారని, ఆమె అంటుంది.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

49