పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాత్రాసాహిత్యం

మూల రచన : జూలియా చార్లోటి

అనువాదం : కీ.శే. పెన్నేపల్లి గోపాలకృష్ణ

డా.కాళిదాసు పురుషోత్తం 9000642079

“ఆమె లేఖలు”

(గత సంచిక తర్గువాయి...) 14వ లేఖ

తెల్లదొరల ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడ్డారు.

మద్రాసుకు ఆరువందల మైళ్లలో ఒక కొత్త గిరిజన జాతి ఈ తిరుగుబాటును లేవనెత్తింది. ఇంగ్లీషువారిలో కలవరం రేకెత్తించిన ఈ తిరుగుబాటును ప్రభుత్వం త్వరలోనే అణఛివేయడంతో అంతా సద్దుమణిగింది.

డిసెంబరు 15వ తేదినాటి ఉత్తరం ముగింపులో ఆమె ఈ తిరుగుబాటును ప్రస్తావించింది. తిరుగుబాటును గురించి పత్రికల్లో చదివి, మీరు భయపడిపోయారా ? అని ఇంగ్లండు నుంచి వచ్చిన ఉత్తరంలో చదివి, దానికి సమాధానంగా ఆమె ఈ విషయం ప్రస్తావించింది. 'పెన్నివిజిల్‌ రాజాగారింటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి, ఇంట్లో ఒక కొత్త అతిధి వచ్చి ఉన్నాడు. అనుకోని అతిథి, అయినా అతన్ని జదంపతులు బాగానే యిష్టపడ్డారు.

అతను తిరుగుబాటును అణచడంలో ప్రభుత్వానికి తోడ్పడ్దాడు. ఇంతవరకూ ఎవరికీ తెలియని ఒక కొత్త కొండజాతివాళ్లు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. వాళ్లు చక్మగా, ధీరంగా, భయంకరంగా ఉంటారు. దేహదారుడ్యంలోను, అలవాట్లలోనూ వాళ్ళు యూదుజాతివాళ్లను పోలివుంటారట. వాళ్లు కంటికి కనబడని దేవుళ్లను, చెట్టుమీద వుండే ఒక భూతాన్ని ఆరాధిస్తారట! దాన్ని దయ్యాంగా భావించి శాంతింప చెయ్యడానికి పూజలు కూడా చేస్తారట. ఇళ్లు చెక్కతో కట్టుకాంటారు. నేల, గోడలు, కప్పు అంతా దేవదారు కలపతో వేస్తారట - ఆ ఆగంతకుడు వివరించాడు.

ఈ జాబులో ద్రాక్షారామం 'పెన్నీ విజిల్ ' రాజాగారి ఆతిథ్యం విషయాలు ఆమె వివరంగా వర్ణించింది. ఆ ప్రయాణం అంతకష్టం అని తెలిసుంటే తల పెట్టి వుండేదాన్ని కాదు. దూరం పదిహేను మైళ్లని విని, సాయంకాలం ఐదున్నరకు బయళ్టేరి రాత్రి పది గంటలకు చేరుకోవచ్చని భావించింది. తీరాచూస్తే 30 మైళ్లు రోడ్డు లేదు. దారిలో కుండపోతగా వాన. పల్లకీ మోసే బోయీలు పాడేపాట కూడా వినరానంత కుంభవృష్టి. పైగా కటిక చీకటి. రాత్రంతా మోళాలుబంటి నీళ్లతో పత్తి తోటలను దాటుకొంటూ, పన్నెండు గంటలు ప్రయాణం చేసి ద్రాక్షారామం చేరారు. బండికంటే పల్లకీ ప్రయాణమే సులభమని ఆమె భావించింది.

ద్రాక్షారామంలో బాటసారుల కోసం కట్టిన ఒక సత్రంలో జదంపతులకు బస ఏర్పాటయింది. పాత తివాచీలు పరిచి అలంకరించారు. బ్రేక్‌ ఫాస్ట్‌ తిన్న తర్వాత,

జదంపతులు రాజాగారి భవనానికి బయలుదేరారు. పెద్ద హంగామాతో స్వాగతం పలికారు. ముందు మేళతాళాలతో ఒక బృందం. ఆ సంగీతం మన Rossinni ని అనుకరిస్తున్నట్లుంటుంది. తర్వాత థ్వజాలు, ఖడ్గాలు వెండి బెత్తాలు, పతాకాలు ధరించినవారి ప్రదర్శన. అటు తర్వాత అతిథులకు రకరకాల బిరుదులు ప్రకటించారు. ఆ బిరుదులేవీ ఆమెకు ఒక్క మాట కూడా అర్ధం


కాలేదు. తర్వాత నాట్యగత్తెలు ముందుకొచ్చి, మడిమలలోతు బురదలో వికారంగా చేతులు తిప్పుతూ నాట్యం మొదలు పెట్టారు. ఎ— మొదట్లో కాస్త సిగ్గుపడ్డాడేమోకాని, తర్వాత ఆ నృత్యం చూస్తూ ఆమెతో పాటు నవ్వడం మొదలు పెట్టాడు.

జదంవతులు రాజభవనం సింహద్వారం వద్దకు చేరగానే ఒక ఏనుగుచేత వారికి పూలమాలలు వేయించారు. రాజాగారి దర్బారు జనంతో కిటకిటలాడుతోంది. యాబై మందికి పైగా నాట్యగత్తెలను తెప్పించారు. అందరూ వంగివంగి సలాములు చేస్తుంటే జదంపతులు మెల్లగా రాజాగారి మందిరం ప్రవేశించారు. రాజుగారు వారిపై పావుగంట సేపు ఉపన్యాసం చేసి స్వాగతం పలికారు. అతిథుల కోసం ప్రత్యేకించిన గదుల్లోకి రాజాగారే స్వయంగా తీసుకొనిపోయి, వారితో కాసేపు ముచ్చటించి వెళ్లారు.

రాజాగారి భవనంలో చాలా గదులున్నాయి. అంతా బురదే! వాటిలో నడవడం కష్టం. ఐతే, చుట్టూ సన్నటి దారి వుంది. ఇది గట్టినేల కావడంతో, గోడలు పట్టుకాని జారిఫోకుండా అడుగులో అడుగువేస్తూ నడిచారు. వాళ్లకోసం ఏర్పాటైన గదులు కూడా అలాంటివే. ఒక వైపు మకాంనే వాళ్లు హాల్‌ అంటారు. దాన్నీ దానికి అనుబంధంగా వున్న గదుల్ని ఆ దంపతు లుండడానికి ఏర్పాటు చేశారు. అందులోంచి దర్చారుకు దారి వుంది. తలుపులు, కిటికీలు లేవు. పెద్దగది చివర వో చిన్నగది, నౌకర్లకు కాస్త స్థలం. మిగతా మూడు వైపుల నుంచి కూడా దర్బారుకు దారులున్నాయి. వాటిలో ఒకటి రాజుగారి మందిరానికి వెళ్తుంది. మాగది, వసారా మధ్య వీధి వైపుకి ఒక చెక్కమంటపం వుంది. అందులో రాజాగారు ఒంటరిగా కూచొని చుట్టకాలుస్తారట! గదిలో టేబిల్‌, తివాచీ, నాలుగు కుర్చీలు, రెండు పేము సోఫాలు, కాళ్లకిందికొక స్టూలు వున్నాయి. గోడలకు స్థానిక చిత్రకారులు వేసిన దేవుళ్ల పటాలు వున్నాయి. చక్మని ఫ్రేములున్న రెండుఫ్రెంచి అద్దాలను అప్పుడే తెరిచి ప్యాకింగ్‌ కేసులతోనే గోడలకు వేలాడదీశారు. మరో రెండు షేవింగ్‌ అద్దాలు కూడా వున్నాయి. “పెన్నివిజిల్‌” గారికి బొమ్మలంటే చాలా యిష్టం, మాకు చూపించడానికి మరికొన్ని గుర్రాలు, నక్కల వర్ణచిత్రాలు తెప్పించారు. అవి రాజాగారికి చాలా కాలం క్రితం ఎవరో ఇంగ్లీషువారు ఇచ్చినవి. అక్కడక్కడ రంగు వెలిసిపోయి వుంటే వాట్ని బాగు చేస్తానన్నాను.

అందుకు రాజాగారు చాలా సంతోషపడిపోయారు. ఓ నక్క బొమ్మలో రంగులు సరిచేస్తుంటే, ఆయన అక్కడే నిల్బొని 'ఆహా ఎంత గొప్ప నైపుణ్యం! కొత్త బొమ్మలా తయారు చేశారంటూ ఆశ్చర్యపోయారు. అదే అదను అనుకొని ఎ - స్త్రీలు బాగా చదువుకోడంవల్ల కలిగే లాభాల గురించి తను ఎప్పుడూ చేసే ఉపన్వాసం యిచ్చేశారు. ఆడపిల్లలకు చదువు చెప్పడం మంచిదేనని పెన్నీవిజిల్‌ కూడా ఒప్పుకొన్నారు కానీ, తన ప్రజలు వట్టి దుర్చలులని, వారికి యిష్టం లేదని, వారికి యిష్టం లేని పని తాను చేపట్టలేనని

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

48