పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది




ప్రారంభోత్సవంలో ఆగస్ట్‌ హెర్మన్‌ ఫ్రాంక్‌ ని గుర్తు చేసేవాడు. ఆయన మానస పుత్రిక అయిన ఉచిత విద్యాబోదన, మాతృభాషా బోధన, పేదలకు హాస్టల్‌ వసతి లాంటివి ప్రపంచానికి కొత్త నేత్రాలని స్మరించేవాడు. షూల్డ్‌ తరంగంబాడి నుంచి మద్రాసుకు వచ్చినందువల్ల తెలుగు బాగా నేర్చుకున్నానని చెప్పేవాడు. ఈ కాలంలోనే 1728 నాటికి మద్రాసులోనే గ్రమటిక తెలుగిక” పూర్తి చేశాడు. ఇదే తాలి తెలుగు ముద్రిత వ్యాకరణం. (వివరాలు అక్షోబర్‌ సంచికలో చూడవచ్చు) షూల్డ్‌ తెలుగు భాషతోపాటు తమిళ, హిందుస్తానీ, దక్కన్‌ ఉరుదు భాషల్లో బైబిలు తర్జుమా చేశాడు. భారత దేశంలో 23 సంవత్సరాలు పుస్తక ముద్రణ, అనువాదాలు, పాఠశాలలు, హాస్టల్‌ వసతి మొదలయినవన్నీ నడిపి అనారోగ్య కారణాల వల్ల 1743లో స్వదేశానికి తిరిగి వెళ్ళాడు. హాలే నగరంలో శేష జీవితం గడిపాడు. అక్కడ కూడా 1746-47 మధ్య కాలంలో నాలుగు శీర్షికల్లో ఆరు తెలుగుపుస్తకాలు ముద్రించాడు. ఇవి ప్రఖ్యాత జర్మన్‌ లూథరన్‌ తత్వవేత్త, పండితుడు అయిన జోహెన్‌ ఆర్నెడ్‌ (1555-1621) రచించిన నాలుగు గ్రంథాలకు అనువాదాలు.

1. ia Sie or do Saltis : మోక్షానీకి కొంచ్చు ఫొయ్యెదొవ - 1746 (ఈ శీర్షికలో రెండు వేర్వేరు పుస్తకాలున్నాయి)

2. Catechismus Telugious minor: సత్యమైన వెదంలో ఉండే జ్ఞానవుపదేశాల యొక్క సంక్షేపం.

3. Mores itamae Christiano dignam delonanres - బుద్ది కలిగిన తెలుగు వాండ్ల లోపలొక డొకడికి పుణ్యపు దొవ చూపించే నూరు జ్ఞాన వచనాల యొక్క చిన్న పుస్తకం (ఈ శీర్షికలో రెండు వేర్వేరు పుస్తకాలున్నాయి.)

4. Colloquim Religiosissimusm : వక గురువు అఇదు బ్రాహ్మల యొక్క నడమన కూచండి విండ్లతోను వాక్కొడి ఆకాసమున్ను భూమిన్ని ప్రప్పించిన 'పెద్దస్వామి మీద ప్రసంగించిన తక మిదె (ఈ పుస్తకం షూల్డ్‌ స్వీయ రచన) ప్రతి పుస్తకంలోనూ లోపలి మొదటి పుట లాటిన్‌ భాషలోనూ, ఆ తరువాతి పుట తెలుగు భాషలోనూ ముద్రించాడు. ఈ పుస్తకాల ప్రతులు బ్రిటీష్‌ మ్యూజియం, లండన్‌ లోను, కాపెన్‌ హగన్‌ లోనీ రాయల్‌ గ్రంధాలయంలోనూ ఉన్నాయి. భారత దేశంలోని, నిరంవూర్‌ తియోలాజికల్‌ సెమినరీ కేర్ గ్రంథాలయంలో రెండో పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని తొలి తెలుగు పుస్తకమని భ్రమించి రాజమండ్రి వారు ప్రచురించారు. ఇది 1747లో హాలేలో అచ్చయింది. ఈ పుస్తకం ప్రతి పొడవు 16 సెం.మీ. వెడల్పు 10 సెం.మీ మొత్తం పుటలు 73. ప్రతీ పుటలోనూ 20 పంక్తులున్నాయి. ప్రతి పంక్తికి 12 నుంచి 14 అక్షరాలున్నాయి.

శీర్షికలో పెద్ద అక్షరాలు 0.7 సెంమీ. పుటల సంఖ్య తెలుగు అంకెలున్నాయి. 45 పుటల వరకు ఒక పుస్తకం. తరువాత సత్యమైన వెదంలో వుండే జ్ఞానవుప్రదేశాల యొక్క సంక్షేపం” మొదలవుతుంది. ఇందులో మొత్తం 24 పుటలున్నాయి. లాటిన్‌ భాషలో ముద్రించిన పుటలో స్పష్టంగా 1747 అనే ఉంది. అందువల్ల ఇది షూల్ళి ప్రచురించిన రెండో పుస్తకం. తొలి తెలుగు ముద్రిత గ్రంధం మాత్రం “మోక్షానికి కొంచ్చుపొయ్యెదావా ఇది అనూదిత గ్రంథం 1746లో ముద్రణ జరిగింది. అదీ జర్మనీ దేశంలోని హాలె నగరంలో తొలి తెలుగు పుస్తకం భారత దేశంలో అచ్చుకాలేదన్నది స్పష్టం.

1747లో 0౦0౧౪౦ఆ౦1 [1162168 7910610౬] ౪౪18౦ ౭౦! 4౧9 అనే 12 పుటల గ్రంథం చిన్న పుస్తకం ప్రచురించాడు. ఇందులో తెలుగు వర్ణ సమామ్నాయం, గుణింతాలు సంయుక్త రూపాలు తెలుగులోనూ, లాటిన్‌ భాషలోనూ రాశాడు. తెలుగు భాషా స్వరూపం సమగ్రంగా చూపాలనే ప్రయత్నమిది.

1750లో ముఫై సంభాషణలున్న మరో పుస్తకం హాలి నుంచే ప్రచురించాడు. ఇది రోమన్‌ లిపిలో ఉన్న తెలుగు పుస్తకం దైనందిన వ్యవహారాలకు సంబంధించిన సంభాషణలు ఇందులో ఉన్నాయి. యజమానులు, సేవకులు, వంటవాళ్లు, చాకళ్ళు, దుకాణదారులు ఇతర పనివాళ్ళతో సంభాషించే పద్ధతులున్నాయి. మనకు పుస్తకాల విక్రేతల వద్ద 30 రోజుల్లో తెలుగుభాష, 30 రోజుల్లో హిందీ భాష అనే పుస్తకాలుంటాయి. వాటికి మూలం షూల్లి ప్రచురించిన సంభాషణల పుస్తకం తొలి ఆకరువు.

1728-32 మధ్యకాలంలో షూల్డ్‌ తెలుగు బైబిలు అనువాదం చేశాడు. ఇది పూర్తిగా చేతిరాత ప్రతి. ఇందులో 432 పుటలున్నాయి. దీని లాటిన్‌ టైటిల్‌ "OCABULARIUM - TELUGO -TAMULO - BIBLICUM - NOLTESTAMENT" అని పేర్మొన్నారు. కొత్త నిబంధనలో 260 చాష్టర్లు, పాత నిబంధన 659 చాష్టర్లున్నాయి. ప్రతిపుటలో తెలుగు పదాల ఉచ్చారణ ఆంగ్లంలోనూ, అర్జాలు ఇంగ్లీషు - లాటిన్‌ భాషలో ఉన్నాయి. తెలుగు బైబిలు - కం - నిఘంటువుగా దీన్ని పేర్కొవచ్చు. 10,500 పదాలకు అర్జాలున్నాయి. 1842లో గుంటూరుకు వచ్చిన లూథరన్‌ శాఖకు చెందిన జాన్‌ క్రిస్టియన్‌ ఫ్రెడ్రిక్‌ హయ్యర్‌ ఈ పుస్తకం తీసికొని వచ్చినట్టు ఆయా లేఖలు స్పష్టం చేస్తున్నాయి.

తెలుగు భాషను ప్రేమించి, తెలుగు భాషను తొలినాళ్లలో ముద్రించిన బెంజిమిన్‌ షూల్డ్‌ మహాశయుడి వివరాలు డాక్టర్‌ జోలెపాలెం మంగమ్మగారు “Book printing in India” అనే గ్రంథంలో వివరించడం మనభాగ్యం. తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020 |