పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వికాసం కూదా జిగెబాగ్‌ అనంతరమే జరిగింది. ఈ వివరాలన్నీ సెప్టెంబర్‌ సంచికలో చూడవచ్చు.

జిగెన్‌బాగ్‌ అనంతరం వచ్చిన రెండో జట్టులో ప్రజలభాషకు పట్టం కట్టిన బెంజమిన్‌ షూల్డ్‌ ముఖ్యుడు. షూల్డ్‌ భారతీయ భాషలయిన తెలుగు, తమిళం, హిందుస్తాని, ఉరుదుతోపాటు ఇంగ్లీషు, జర్మన్‌, పోర్చుగీసు, ఫ్రెంచ్, గ్రీక్‌, హిబ్రూ, సిరియన్‌, అరబిక్‌ భాషలు నేర్చిన బహుభాషా పండితుడు. బెంజమిన్‌ షూల్జ్ 1689 జనవరి 7వతేదిన జర్మనీ దేశంలోని సోనీబర్గ్Sonneeburg గ్రామంలో జన్మించాడు. లాండ్స్‌ బర్గ్‌ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. అనంతరం ఫ్రాంక్‌ ఫర్ట్‌, హలె (జర్మని) విశ్వ విద్యాలయంలో ఉన్నత విద్యపూర్తి చేశాడు. హలెలో అప్పటికీ ప్రధానాచార్యులుగా ఉన్న ఆగస్ట్‌ హెర్మన్‌ ప్రాంక్‌ (August Hermann Francke 22-3-1633-8-6-1727) హెన్రిక్‌ మైకెల్‌ నేతృత్వంలో మతతత్వం, మానవ జీవ శాస్త్రంతో పాటు లాటిన్‌, గ్రీక్‌, హిబ్రూ, సిరియన్‌, అరబిక్‌ భాషలు నేర్చుకున్నాడు. బహుభాషాధ్యయనం మానవుణ్ణి తేజోవంతుణ్ణి చేస్తుందన్న గురువుల మాటలు షూల్డ్‌ వంట బట్టించుకున్నాడు. ఆతనికున్న సూక్ష్మ పరిజ్ఞానాన్ని భాషాధ్యయన ఆసక్తిని గమనించిన గురువులు అనతికాలంలోనే భారత దేశానికి మత గురువుగా, భాషావేత్తగా, రచయితగా కవిగా గుర్తించి పంపారు. భారత దేశానికి వచ్చిన అతికొద్ది కాలంలోనే తమిళం తెలుగు నేర్చుకున్నాడు. అప్పటికే జిగెన్‌ బాగ్‌ తమిళ బైబిలు అనువాదం ప్రారంభించాడు. భారత దేశ కాలమాన మత పరిస్థితులను పూర్తిగా ఆకళింపు చేసుకున్న జిగెన్‌ బాగ్‌ తమిళ ప్రాంతపు దేవాలయాలు, వివిధ మతాలపై ఒక సాధికారిక గ్రంథం 219 పుటల్లో పూర్తి చేశాడు. తమిళంలో నీతివెణ్బా, కొందైవేందన్‌, ఉలగనీతి అనే కావ్యాలు రచించాడు. జిగె బాగ్‌కి తోడు జాన్‌ ఎర్బెఫ్ట్‌ (గుండ్లర్‌ (1677-1720) అనే మరో జర్మన్‌ పండితుడు కలిసి 1713 నాటికి ఒక తమిళ గ్రంధం సెప్టెంబర్‌ నెలలో ప్రచురించారు. ఈ నేపథ్యంలో షూల్డ్‌ రాక తరంగంబాడిలో జర్మన్‌ పండితులకు మరింతబలం చేకూరినట్టయింది. షూల్డ్‌ వచ్చిన అనతికాలంలోనే అంటే 1719లో జిగె బాగ్‌ మరణించాడు. జిగె బాగ్‌ మరణించే నాటికి 37 సంవత్సరాలు. ఆ బాధనుంచి తేరుకునేలోపే చురుకుగా ముద్రణా బాధ్యతలు కొనసాగిస్తున్న గ్రుండ్లర్‌ 1720 మార్చి 19వ తేదిన మరణించాడు. తరంగంబాడి బాధ్యతలన్నీ షూల్డ్‌ పైనే పడ్డాయి. షూల్డ్‌ మీద పడిన పెనుభారం, సహచరుల మరణం ప్రాంతీయ బాధ్యతలన్న ఒకవైపు కుంగదీసిన మరో వైపు కర్తవ్య నిర్వహణ బాధ్యతను, ఇంకోవైపు దేశీయ పాఠశాలల నిర్మాణం, వారికి కావలసిన పుస్తకాల తయారి క్షణంతీరిక లేకుండా చేసింది. ఈ పరిస్థితులలో పోర్చుగీసు, డేనిష్, తమిళ భాషల్లో ఇరవై పుస్తకాలను ఆరేళ్ళల్లో ప్రచురించాడు. 1721 నాటికి 48 కీర్తనలు సంకలనం చేసి ముద్రించాడు. 1728 నాటికి 160 తమిళ కీర్తనలను అచ్చు వేశాడు. ఆపై దేశీయ సంగీత బాణీల్లో 112 కీర్తనలున్న పుస్తకాన్ని అచ్చు వేశాడు. అంతకు ముందే జిగెనా బాగ్‌ అసంపూర్తిగా మిగిల్చిన తమిళ బైబిలు అనువాదం 1725నవంబర్‌ 25 నాటికి పూర్తి చేశాడు.

మరో కోణంలో 1725 నాటికి డేనిష్‌ వారికి అధీనంలో తమిళ గ్రామాల్లో పాఠశాలలు ప్రారంభించారు. గ్రామ వాసులందరూ కులమత తారతమ్యం లేకుండా మాతృభాషలో విద్వాబోధన చేయాలనే నియమం పెట్టారు. దీనికిగాను తమిళ పండితులకు మంచి జీతం యిచ్చి పాఠశాలలు నడిపారు. 1725 నాటి లెక్కల ప్రకారం ఉచిత పాఠశాలలు 21 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో పిల్లలకు పాఠ్యప్తుకాలు అచ్చు వేయవలసిన అవసరం ఏర్పడింది. దానికి కావలసిన పాఠ్యపుస్తక ప్రణాళిక షూల్డ్‌ తోపాటు దేశీయ పండితుల సహకారంతో పుస్తకాలు తయారైనాయి. విద్యార్థులు రాయడం, చదవడం, లెక్కలు కట్టడం లాంటివి విధిగా నేర్చుకోవాలి. తమిళంతో పాటు ఇంగ్లీషు, పోర్చుగీసు భాషలు అధ్యయనం తప్పక చేయాలనే నియమం ఉంది.

మద్రాసులో 1726 నాటికి రెండున్నర లక్షలమంది దేశీయ జనాభా ఉంది. వారిలో తెలుగువాళ్లు కూడా అత్వధికంగానే ఉన్నారు. దానికో కారణం కూడా ఉంది. 1639 ప్రాంతంలో చెన్న పట్టణం పరిసర ప్రాంతాలు తెలుగు రాజుల ఏలుబడిలో ఉన్నందువల్ల తెలుగువారి ఉనికి, తెలుగువారి ప్రాభవం కొంత మెరుగ్గానే ఉంది. ఐతే తెలుగువారిని మాత్రం జెంటూలనీ, మలబారీలని, (తర్వాత మదరాసీలు) పిలిచేవారు. కోస్తా, తూర్పుకోస్తా, ఉత్తర కోస్తా ప్రాంతాలు ఇంగ్లీషు వారి అధీనంలో ఉండేవి. ఆనాటికే ఇంగ్లీషు వారి గిడ్డంగులున్నాయి. షూల్డ్‌ తెలుగువారి మధ్య ఉచిత పాఠశాలలు ప్రారంభించాడు. దీనికి డేనిష్‌ రాజుల సహకారం కూడా లభించింది. వెంటనే రెండు తెలుగు పాఠశాలల్ని మలబారీ తమిళులకి ఒక పాఠశాల 1726లోనూ పోర్చుగీసు పాఠశాల 1732లోనూ బ్లాక్‌ టౌన్‌లో ప్రారంభించాడు. బ్లాక్‌ టౌన్‌ లో ప్రారంభించిన తెలుగు పాఠశాలతోపాటు పోర్చుగీసు పాఠశాలల్లో తెలుగు ప్రత్యేక అధ్యయనంగా బోధించేవారు. తెలుగు పాఠశాల బోధనలో విద్యార్థులతోపాటు షూల్డ్‌ కూడా తెలుగు నేర్చుకుని తెలుగులోనే మాట్లాడేవాడు. మరో విశేషం ఏమంటే ఒక ఏడాదిలోనే తెలుగు అనర్గళంగా మాట్లాడి తెలుగులో తెలుగువాళ్ళ మధ్య పాటలు, ప్రసంగాలు చేశాడు.

1726 సెప్టెంబర్‌ 14వ తేదీన మలబార్‌ స్కూల్‌లో 12 మంది విద్యార్థులు చేరారు. వారికి విద్య ఉచితం. తెలుగు పాఠశాలలో కూడా అనేక మంది విద్యార్దులు చేరారు. కాని పాఠశాల నిర్వహణకు బ్రిటీష్‌ గవర్నర్‌ సహకారంతో నెలవారి గ్రాంట్‌ వచ్చే ఏర్పాటు జరిగింది. భారతదేశంలోనే గ్రాంట్‌-ఇన్‌ఎయిడ్‌ పాఠశాలకు ఇక్కడే అంకురార్పణ జరిగింది. అది తెలుగు పాఠశాలలో కావడం గమనించదగిన విషయం. పోర్చ్‌గీసు పాఠశాలలో 1932 నాటికి ఏడుగురు విద్యార్థులు చేరితే అందులో ఆరుగురికి ఉపకారం వేతనం యిచ్చారు. అదే ఏడాది మలబారు స్కూలులో (పాక్షికంగా తెలుగు తమిళ విద్యార్థులు కలిసిన పాఠశాల) 17 మంది విద్యార్థుల్లో 18 మంది బాలురు నలుగురు బాలికలు. వాళ్లలో తొమ్మిది మంది మిషన్‌ కాంపౌండ్ హాస్టల్‌లో ఉన్నారు. షూల్డ్‌ (ప్రారంభించిన ఉచిత పాఠశాల విద్యాబోధన (తెలుగు, తమిళం, పోర్చుగీసు భాషల్లో) వల్ల పేద వర్ధాల విద్యార్థుల జీవితాలకు ఒక వెలుగు కిరణం ఉదయించి నట్టయింది. షూల్త్‌ ప్రారంభించిన పాఠశాలల

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

36