పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధారావాహిక

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, 9848123655

పడమటి గాలితో

నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద

మానవుడికి భాష ఎంత అవసరమో అక్షరాన్ని తరతరాలకు భద్రం చేయవలసిన అవసరం కూడా అంతే ఉంది. భాష ఏర్పడిన వేల సంవత్సరాలకు అక్షరం లిఖిత రూపంలో వచ్చిందన్నదీ అక్షరాక్షర సత్యం. తెలుగు భాష పుట్టు పూర్వోత్తరాల చరిత్ర అసక్తి కలిగించే ప్రాచీన చారిత్రక గాథ. తొలి తెలుగు శాసనం (575) ఎర్రగుడిపాడు శాసనమాకాదా అన్నది కొంత వివాదాస్పదమే. అమరావతిలో దొరికిన భ్రష్ట్రశిలాఫలకం “నాగబు” అనే మాట తొలి లిఖిత తెలుగు పదమని వేటూరి ప్రభాకరశాస్త్రి (భారతీ జూన్‌ 1928) చెప్పేవరకూ మనకు తెలియదు. ఈ మాటనే ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో ధ్రువీకరించి అదే మాట తన పుస్తకం అగ్రభాగన ముద్రించిన విషయంలోక విదితమే. శాసనభాషా క్రమపరిణామ వికాసం అసక్తి కలిగించే అద్భుత సాహిత్య సంపద. భాష కావ్య రూపం దాల్చక ముందే శాసనాల్లో పద్య సంపద ఉందన్నా విషయం మనకు తెలిసిందే. అది నాణానికి ఒక వైపు మాత్రమే. ద్వితీయ పార్య్వంలో ముద్రణా వికాస విస్తరణ ప్రారంభమయిన తర్వాత సాహిత్యం, సమాజం బహు విధాలుగా వృద్ధి చెంది వికసించింది. ఈ నేపథ్యంలో భారతదేశానికి పాశ్చాత్యులు వాణిజ్యం పేర వచ్చిన కాలం విచిత్రమైన, వైవిధ్యమైన వ్యాపారం. ఇది ఐబహుముఖాలుగా విస్తరిల్లింది.

'దుబాసిలనబడే ద్విభాషీలూ: వాస్మోడిగామ 1498 మే 20న కోజికోడులో దిగిన తర్వాత బుడత కీచు (పోర్చుగీసు) వారి వ్యాపారం బాగా వృద్ధి చెందడం, ఆపై ఇతర దేశాలు భారత దేశంవైపు ఆకర్షించడం జరిగింది. దాంతో 1600లో ఇంగ్లండ్‌ తూర్చిండియా కంపెనీ భారతదేశంలో వర్తకం చేయడానికి గుత్తాధిపత్యం పొందారు. ఆపై 1602లో డచ్‌ వారు యునైటెడ్‌ ఈస్టిండియా కంపెనీ, 1616లో డెన్మార్మువారు, 1664లో ఫ్రెంచ్‌ వారు, 1665 ప్రాంతంలో బెల్లియం వారి ఆస్టంట్‌ కంపెనీ, 1712లో స్వీడన్‌ దేశీయులు తూర్చిండియా కంపెనీ. విడతలు విడతలుగా వ్యాపారం, ఆపై వాళ్ళ వాణిజ్య సంఘాలు నెలకొల్పారు. ఈ నేపథ్యంలో 1622 నాటికి ప్రళయ కావేరిలోనీ డచ్‌ వారు బానిస వ్యాపారం కూడా చేశారు. నాలుగైదు వందలమంది బటేవియాకు తీసుకుపోతున్నట్లు తామస్‌ మిల్‌ అనే ఇంగ్లీషు వర్తకుడు బందరులోని తన అధికారులకు తెలియజేశాడు. ఇలా పాశ్చాత్య దేశాలు మనదేశంలో వాణిజ్య పంటలయిన సుగంధ ద్రవ్యాలు, మణులు, మాణిక్యాలతో పాటు బానిసలుగా మనుషుల వ్యాపారం సాగింది. ఐతే 1682లో బానిసల వ్యాపారం నిషేదిస్తూ కుంఫిణీ దొరతనం వారు ఇంగ్లీషు, తెలుగు, పోర్చుగీసు భాషల్లో ఆజ్ఞాపత్రాన్ని వెలువరించారు. ఈ పరిస్థితిలో తెల్లవాళ్లకి మనకు ద్విభాషీలు (దుబాసీ) కావలసి వచ్చింది. తొలినాళ్ళలో పోర్చుగీసు భాష అధికారికంగా రాజ్యం చేసింది. దినసరి లెక్కలు, వాది 'ప్రతివాదుల అభియోగాలు, ధర్మాసనం వారి తీర్పులు, ఆస్థి పాస్తుల క్రయవిక్రయాలు దాన ధర్మాలు మొదలయినవన్నీ బుదత కీచు భాషలోనే జరిగినట్టు (1670-1681) నాటి లేఖల వల్ల తెలుసుకోవచ్చు. ఈ కాలంనాటి దేశీయ గీయ ద్విభాషీయులు పెత్తనం అంతింతకాదు. దాదాపు వాళ్లే రాజ్యం చేసేటంతదాకా ఎదిగి అటు పాశ్చాతుల్ని ఇటు దేశీయుల్ని మోసగించే స్థితి కలిగింది. కొన్ని సందర్భాలలో దొరల ఆ(గ్రహానికి గురై శిక్షలు కూడా అనుభవించారు. తొలినాటి ద్విభాషీయుల మోసం, లంచగొండితనం గమనించిన తెల్లదొరలు స్వంత గ్రంధాలు తయారుచేసుకోవలనిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అత్యంత నమ్మకస్తులుగా ఏర్పడిన కాంద్రేగుల జోగిపంతులు 1763 ప్రాంతం, గోడె జగ్గారావు (1761) ఆనంద రంగపిళ్ళే (1747) లక్ష్మన్న (1750) మొదలయిన వాళ్ళు నమ్మకంగా పనిచేసి కొందరు జమిందారులు కూడా అయ్యారు.

తొలి తెలుగు పుస్తక ప్రచురణకర్త షూల్ద్:

పాశ్చాత్యులు భారత దేశానికి విడతలు విడతలుగా వివిధ దేశాల నుంచి వచ్చారు. ఇక్కడె స్థిరపడి వేర్వేరు పేర్లతో వ్యాపార కలాపాలు ప్రారంభించారు. నేటి తమిళనాడులోని తంజావూరు

సమీపంలో తరంగంబాడినీ (Tranqubar) డెన్మార్కు వారు 1616 నాటికే ఆక్రమించారు. అందువల్ల డెన్మార్కు రాజు ఆదేశానుసారం భారత దేశానికి వచ్చిన తొలి ప్రొాటస్టెంట్‌ లూథరన్‌ మిషనరీ బర్తలోమయి జిగెనాబాగ్‌ Barthalomoaus Ziegenbag. ఈయన తన సహచరుడైన హెన్రీఫుట్‌ షా Heinrich Pleulschauతో కలిసి 1705 నవంబర్‌ 29న డెన్మార్ము దేశపు రాజధానీ నగరమైన కొపెర్నఏం (Copernhagen)లో బయలుదేరి 1706 జులై 9 నాటికి తరంగంబాడి చేరుకున్నారు. వీరి రాకతో భారత దేశంలో ప్రాటస్టెంట్‌ క్రైస్తవ మత శాఖ ప్రారంభమయింది. తమిళ తెలుగు హిందుస్తానీ ముద్రణా

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

35