పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాటల నిర్మాణం

వాచస్పతి

(గత సంచిక తరువాయి...)

పదనిష్పాదనకళ

3

The joy of coining new words!

వ్యావహారికం అంటే అర్ధం - ఆంగ్ల మాధ్యమ జనాల సంకుచిత అవగాహనకి అనుగుణంగా యావత్తు తెలుగుభాషనీ అంతం చేయడం కాదు. ఈమాత్రం ఆంగ్ల మాధ్యమం గిడుగువారి కాలంలో కూడా ఉంది. జనానికి అర్థం కావడం అంటే కొత్తపదాల్ని సృష్టించకూడదని కాదు. అర్ధమవుతున్న భాషలోనే కొత్త పరిభాసనల్నీ తత్సంబంధిత పదాల్ని మిశ్రమం చేయడమని !

ఇంకో కోణం : అచ్చతెలుగువాదం

ఇదిలా ఉండగా, ఆర్య-ద్రావిడ జాతివాదాల్ని గ్రుడ్డిగా నమ్మేవారు కొందణున్నారు. అలా నమ్ముతూ, వేలాది సంవత్సరాలుగా ఈ దేశపు శాస్త్రీయ చింతనాధారని పరిపుష్టం కావించిన సంన్కృతాన్ని వారు పరాయిభాషగా పరిగణిస్తారు. ప్రతిదీ అచ్చతెలుగులోనో, తెలుగు మాండలికాల్లోనో, వచ్చి వ్యావహారికం లోనో ఉండాలని వారంటారు. ఈ వాదాన్ని కూడా యథాతథంగా ఆమోదించడం కష్టం. ఎందుకంటే ఇప్పటిదాకా నడిచిన చరిత్రని రద్దుచేసి పారెయ్యలేం. ఇప్పటికే భాష లోకి వచ్చిన పదాల్ని సంప్రదాయాల్ని వెళ్ళగొట్టలేం. ఎట్టి పరిస్థితుల్లోను కాలం వెనక్కి నడవదు. భాషను అభివృద్ధి చేసుకోవాలి. తప్పదు. కానీ ఆ క్రమంలో ఇలాంటి హఠాన్‌ నాటకీయ పరిణామాలు మట్టుకు ఎంతమాత్రమూ పనికిరావు. అలాంటి వాటికి దిగితే మనం యావత్తు తెలుగు సాంస్కృతిక వారసత్వాన్నీ తరువాతీ తరాలకు అర్థం కాకుండా చేసిన వారమౌతాం. పాత తెలుగు పుస్తకాలూ, పాటలూ, పద్యాలూ కథలూ తరువాతి తరాలకు అర్ధం కావాలి. అలా అర్ధమయ్యేలా మన విద్యావిధానమూ మనం రూపొందించే పదాలూ ఉండాలి. మన విద్యావిధానం గతానీకీ భవిష్యానీకి వారధిగా పనిచేయాలి. సంస్కృతాన్ని పరాయిభాషగా చూసే ధోరణి సమీచీనం కాదు. అది పూర్తి అవాస్తవికమైనది. దాన్నొక ఊహాలోకంగా అభివర్షించదానికి నేను సంకోచించను. సంస్కృతం తెలుక్కి కన్నతల్లి కాకపోవచ్చు గాని పెంపుడుతల్లి మాత్రం అవును. సవతితల్లి మట్టుకు కానే కాదు. మన జనాభాలో అత్యధిక సంఖ్యాకులు హిందువులు. ముస్లిములకి అరబ్బీ ఎంతటి పవిత్రభాషో హిందువులకు సంస్కృతం కూడా అలాంటిదే. వారికి సంస్కృత సంపర్మం అత్యంత సహజమైనది. వారికి ఆ భాషతో దైనందిన అవసరాలు ఉన్నాయని మరువరాదు.

1. “అర్ధం కావడం" ఒక్కటే మన కృషికి కొలబద్ద కాకూడదు. భాషా సాహిత్యాలనేవి ఏ యుగంలోనూ ఆ కొలబద్ద ననుసరించి వర్టిల్లినవి కావు. ఇంగ్లీషులో సైతం నూటికి 99 పదాలు అది మాతృభాషగా గలవారికూడా అర్దం కావు. అంత మాత్రాన ఆ భాషలో కొత్త పదాల సృష్టి ఆగిపోలేదు. ప్రతీ కొత్త ప్రచురణ నాటికీ ఆంగ్ష నిఘంటువుల రాశి పెఱక్కుండా పూర్వపరిమాణం దగ్గరే స్తంభించిపోవట్లేదు. ఇప్పుడు అర్ధమౌతున్న పదాలు కూడా గాల్లో తేలునో, కలలోనో జనం దగ్గణికి రాలేదు. ఈ అర్ధం కావడం వెనుక కొంత ప్రయత్నం ఉంది. కొంత శిక్షణ ఉంది. కొంత ప్రచార ప్రక్రియ ఉంది. ఉండాలి కూదా.

2. అర్థం కావడం అనేది - ఒకణు ఏ సామాజిక నేపథ్యం నుంచి వచ్చారు? ఏ వృత్తి, వ్యాపార రంగానికి చెందిన వారు ?ఎంతవణకు చదువుకున్నారు? ఏ విధమైన అభిరుచి గలవారు? మొదలైన అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. అందుచేత అర్థం కాకపోవడం అనేది ఆ అర్థం కానివారి లోపమే తప్ప పదప్రయోగంలోని లోపం కాదు.

3. కొత్త పదాలు కల్సించదాన్ని ప్రోత్సహిస్తున్నట్లే కొత్త పదాలు నేర్చుకోమని కూడా ప్రోత్సహించాలి.

4. భాషలో పదాలు ఎల్లప్పుడూ అంతకు ముందున్న పదాల నుంచే పరిణామం చెందుతాయి. లేనిది ఎక్కణ్డుంచీ రాదు. పదం మీద పదం పేఱుకుంటూ (pile up) పోతుంది. అయిజే పేర్చేవారు కావాలి. అ పేర్చేవారికి అంతకు ముందు పేర్చబడ్ల పదాలూ అవి పేఱుకున్న విధానం తెలిసి ఉందాలి. అలా తెలిసినవారు ఎంత ఎక్కువమంది ఉంటే అంత తొందఅగా భాష అభివృద్ధి చెందుతుంది.

5. ఇప్పుడు ఇంగ్లీషులో ఉన్న సాంకేతిక పదాలు కూడా మొదట్లో వాడినప్పుడు ఎవణికీ అర్దం కాని పదాలే. వ్యకాలు (వ్యక్తిగత కలనయంత్రాలు అంటే PC లు) జనం చేతుల్లోకి రాకముందు ఒక పాతికేళ్ళ క్రితం Hard Disk అనేది సాధారణ ఆంగ్లేయులక్కూడా హాస్యాస్పదమ్హైాన పదమే. మనం కోరుతున్నదల్లా “తెలుగు అనువాదాలన్నీ హాస్యాస్సదమై నవే అనే ఈ మూఢ విశ్వాసం నుంచి బయటపడమనీ, తెలుగుపదాల్ని కూడా ఇంగ్లీషులాగానే ప్రేమించమనీ ! కొత్త తెలుగుపదాల్ని వాడుతున్న కొద్దీ నవ్వురావడం మానేసి గౌరవభావం కలగడం మొదలవుతుంది. సృష్టిస్తున్నకొద్దీ, వాడుతున్న కొద్దీ తెలుగు పదాల క్రమబద్ధతనీ, నిర్మాణాన్నీ జనం అస్వాదించడం మొదలుపెడతారు. తెలుగులో కూడా గౌరవనీయమైన పదజాలం (ocabulary) విస్తారంగా ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి. భాష యొక్క మౌలిక స్వభావాన్నీ స్వాతంత్రాన్ని నిలబెట్టాలి. మన భావదారిద్రానికీ మాతృభాషా పరమైన అజ్ఞానానికీ ఇంగ్లీషు పదాలతో అతుకు వేసుకున్నంత మాత్రాన గౌరవం ఫొందుతామనుకోవడం ఒక బ్రమ. ఆ సదరు “గౌరవనీయ పదాలు” కూడా మళ్ళీ మళ్ళీ అందఱూ వాడడం మూలాన కేవలం ఒక్క తరంలోనే అగౌరవనీయాలవుతాయి. అప్పుడు మళ్ళీ మన గౌరవనీయ పదాల వేట యథామామూలే. గతంలో ఎన్నోసార్లు అలా జఱిగింది.

6. స్వకీయత (Originality) ద్వారానే ఏ జాతైనా గౌరవాన్ని పొందుతుంది. అంగ్ల పదాలు ఆంగ్లేయుల స్వకీయతకి నిదర్శనం. మరి ఒక స్వతంత్ర, విభిన్నజాతిగా మన స్వకీయత సంగతేంటి? భావాలతోపాటు పదాల్ని కూడా అనుకరించి తీఱాల్సిందేనా? అలా అనుకొని ప్రత్యామ్నాయ తెలుగుపదాల్ని సృష్టించకుండా కేవలం ఇంగ్లీషు పదాలతోనే లాగిద్దామనుకుంటే కొన్ని పంక్తులు వ్రాసేసరికి

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

3