పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేగిరపరచవచ్చుననీ భావించారు.

తెల్లవారి బలప్రయోగానీకి, క్రమంగా వాళ్ళు తెస్తున్నమార్పులకు 'కల్లలాడరు ఇంగిరీజులు అంటూ వారినీ “సంఘసంస్కరణ పతాకలు” గా. కీర్తించే గురజాడ వంటి బుద్దిజీవుల మద్దతుకూడా దొరికింది. ఈ మద్దతు వెనుక విజయనగరం సంస్థానం ఆధిపత్య ధోరణులకు ఎదురుతిరుగుతున్న గిరిజనుల మీద, వారి సంస్కృతి మీద, వారి పాలకుల మీద తిరస్కారభావం కూడా ఉండవచ్చు. అప్పటి నుండి గిరిజనులను అజ్ఞానులుగా అడవి మనుషులుగా చిత్రిస్తూ, జాలి ఒలకబొయ సాగారు. ఇలా వలస ప్రభుత్వం మనను బానిసత్వపు బందిలిదొడ్డిలోకి తోలటం వల్ల వస్తున్న దుష్పరిణామాలను, చిలకమర్తి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, ప్రకాశం పంతులు హెచ్చరిస్తూనే ఉన్నారు.

తెల్లవాడి పరిచయంతో వాళ్ళ లిఖిత సాహిత్య ప్రక్రియలు నవల, కధ కవితల వంటి కొత్త ప్రక్రియల ఉత్పత్తి అక్షరాస్యత పెరిగిన కొద్దీ పాఠకులు పెరిగారు. సమాజం చదువుకొన్న లేని వాళ్ళుగా విడిపోయింది. ఇటువంటి తరుణంలో గిడుగు సవరలను అర్జం చేసుకోడానికి ప్రయత్నించారుకాని, ఒరిస్సా రాష్ట్ర విభజనకు బాధపడిన ఆయన రాజమహేంద్రికి తరలి పోవటంతో అటువంటి ప్రయత్నాలు ఆగిపోయాయి. ఆయన వ్యావహారిక భాషోద్యమం,మాండలికాన్ని తోసిరాజని లిఖిత సాహిత్యానీకి ప్రోత్సాహమిచ్చింది. ఒక మిధ్యాప్రామాణిక భాష బలపడింది.

ఒక పక్క శిష్టవర్గం కవిత్వం పిచ్చి పెంచుతుంటే ,ప్రజలు మరింత అజ్ఞానంలో కూరుకుపోసాగారు. గురజాడ, రావిశాస్త్రి, కారా, చాసో వంగపండు, గద్దర్‌ వీళ్ళంతా ఇలా చదువుకున్న వాళ్ళను, జన సామాన్యానికి కావలసిన చదువు, వ్యవహార జ్ఞానం నుండి కవిత్వం, కళల వైపు మళ్ళించారు. మసాలా, ఉద్యమ సాహిత్యాలు "పెరిగిపోయాయి. సంఘాలు పెట్టుకుని సిండికేట్‌ అయ్యారు. రావిశాస్త్రి మరో వెన్నెలకంటి రాఘవయ్య కాలేకపోయారు సరే. న్యాయవాది అయిన ఆయన వ్యవహార జ్ఞానం లోపించిన రచనలను గాడిలో పెట్టలేక పోయారు.

ఇక, గిరిజన ప్రాంతాలలో పనిచేసి “నెల నెలా వెన్నెల 'సంతోష చంద్రశాలలు “చదువు కొత్తలు” నడిపిన శిష్ట సాహిత్యవేత్తల యాత్రా సాహిత్యాలలో, రచనలలో జపాన్‌ హైకూలు, బషో కవిత్వాలు తప్ప, అక్కడ వెన్నెల బయళ్ళలో చూడదగిన చుక్కలు, ఆటలు, పాటలు కనిపించవు. గిరిజన ప్రాంతంలోని తన స్వగ్రామంలో అమ్మ కొలిచే దేవత జాకరమ్మ గుర్తుందిగాని (కోకిల ప్రవేశించే కాలం) , తమ అభిమాన రచన ఒడియా నవల అనువాదం 'అమృత సంతానంలో ప్రతీ అధ్యాయంలో వచ్చే ఆ దేవత, ఆ దేవతకు చేసే కొర్రకొత్త పండుగ సందడిని వర్ణించిన రచన 'ఆదివాసీ పండుగలు (పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ)లో వివరాలు, తాను నడిచిన దారులలో గిరిజనుల దేశకాలాలు వారి చరిత్ర జాడలు తెలుసుకోవాలని తోచలేదు.

ప్రజలు తమ సాహిత్యాన్ని తాము అల్లుకోకుందా, రచయితల వైపు చూడసాగారు. తమ విత్తనాలు, ఎరువులు, తాము తయారు చేసుకోకుండా, కంపెనీల మీద ఆధారపడసాగారు.

కెన్యా రచయిత, మాతృభాషోద్వమకారుడు “గూగీ వా థియాంగో"

కెన్యాలో, 1960లలో, తన ముందే చోటుచేసుకున్న ఇటువంటి పరిణామాలను ప్రసిద్ద రచయిత గూగీ వా ధియాంగో “బందీ” (స్వేచ్భా సాహితి) లొ ఇలా వర్ణిస్తాడు. స్థిరపడిన వలసవాదులు ఉత్పత్తి చేసిందేమీలేదు. కళలేదు. సాహిత్యం లేదు. సంస్మృతి లేదు. గిలికింది యాత్రా గైడ్‌లు మాత్రమే ..... పేర్లు మెరిసే అట్టలు తప్ప వాటిలో ఉన్నదంతా శూన్వమే...వాళ్ళ నాటకరంగం.... మోటు అనుకరణ తప్ప మరేమీ కాదు. ఒక చిన్న సామాజ్యాన్ని తయారు చేసుకున్నారు” (పుట57) వీటిని ఎండగడుతూ అతడు తన మాతృభాష '“గికుయు”లో రాసి వేయించిన నాటకం వల్ల అతడు జైలు పాలవుతాడు. కాని, క్రమంగా ఆ ఉద్యమం ప్రజల భాష నోర్చుకోండి- మీ సంస్రుృతిలో ఉత్తమమైన దానిని ప్రబోధించండి. అభ్రీకన్‌ నంస్కుతిలో ఉత్తమమైన దానిని నేర్చుకోండి. ఇదే మన విముక్తి మార్గం. ఇందులోనే మనకు గమ్యం ఉంది(140) అని 1951లోనే ఉద్బోధించిన భారత జాతీయుడు మాకెన్‌ సింగ్‌ నుండి స్ఫూర్తి పొందింది. క్రమంగా ప్రపంచం కీర్తించే రచయితలు, కళాకారులు, క్రీదాకారులు ఆఫ్రికానించి వస్తుంటే మనవాళ్ళు రిజర్వేషన్లతో తృప్తిపడుతున్నారు. మన ఇంగ్లీష్‌ పంతుళ్ళు, ఆఫ్రికన్‌ రచయితలు చినువా అచ్చే, సోలె వోయింకా, గూగీ, చిమమండ రచనలు మనకు ఏం గుణపాఠాలు నేర్చుతాయో చూడకుండా ఉన్నది ఉన్నట్లు అప్పచెప్పుతున్నారు. మన వేధావులు యధాతథంగా అనువదిస్తున్నారు. సంతోష

తరువాయి 34 వ పుటలో.......

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

29