పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంబంధాన్ని గురించి రకరకాలుగా చెప్పుకుని వారిద్దరికీ చెడిందని ప్రచారం చేశారట. అప్పటికే విశ్వనాథ వారి వేయిపడగలు నవలను పీవీ హిందీలోకి అనువదిస్తున్నారనే వార్త వ్యాప్తిలో వుంది. అయితే ఆనాటి ఆ సన్నీవేశంతో ఆ అనువాద కార్యక్రమం ఆగిపోతుందని, సత్యనారాయణ గారు హిందీ సాహిత్య రంగానికి పరిచయమయ్యే అవకాశం, దాన్ని బట్టి అఖిల భారత స్థాయిలో ఆయనకు పేరొచ్చే అవకాశం దానంతట అదే తప్పిపోయిందనీ చాలా మంది బ్రమపడ్డారు. కానీ వారి ఊహలు అన్నీ అపోవాలుగానే మిగిలిపోయాయి. ఆనాటి నుంచీ సత్యనారాయణ గారు - పీవీ గారు మరింత సన్నిహితులయ్యారు. “వేయిపడగలు” ను పీవీ “సహస్ర ఫణ్‌” గా అనువదించడంలో తమ రాజకీయ కార్యకలాపాల వత్తిడి వల్ల కొంత ఆలస్యం జరిగినా, ఇది 1971లో భారతీయ జ్ఞానపీఠ్‌ వారి ద్వారా వెలువడి, వారిద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది.

జర్నలిస్టుగా పీవీ

1945-46 సంవత్సరాలలో దేవులపల్లి రామానుజరావు గారు ఆంధ్ర సారస్వత పరిషత్‌ పక్షాన “శోభ " అనే మాసపత్రికను నడిపారు. ఆ సమయంలోనే పీవీ తన మిత్రబ్బందంతో కలిసి “కాకతీయ సారస్వత సంకలనములు” పేర ఒక వార్తాపత్రికను ప్రారంభించారు.

పోలీస్‌ చర్య తరువాత తెలంగాణాలో ఒక వినూత్న రాజకీయ సంచలనం ప్రారంభమైంది. ప్రజాతంత్రశీలత అనే కొత్త సంస్కృతికి, సంప్రదాయానికి బీజాలు పడ్డాయి. కాలానుగుణంగా 1948 నుంచి కాకతీయ పత్రిక ఉద్ధృతిని పెంచింది. గార్లపాటి రాఘవరెడ్డి గారి పరిదేవన కావ్యం ఈ పత్రికలోనే మొదటిసారి అచ్చయింది. ఈ పత్రికలో పీవీ గారి పలు రచనలు, “మానావమానాలు” అనే నవల ప్రచురించబడ్డాయి. ప్రసిద్ద హిందీ కవి మహాదేవవర్మ కవితలపై సుదీర్ఘ నమీక్షను కూడా పీవీ ఈ పత్రికలో ప్రచురించారు.మతకలహాలు ఇతివృత్తంగా “యెదవ నాగన్న” కథను, మహాకవి “గ్రే " ఎలిజీకి తెలుగు అనువాదాన్ని కూడా పీవీ ఈ పత్రిక ద్వారానే పరిచయం చేశారు. పీవీ గారి “గొల్లరామవ్వ” కథ, “బ్లూ సిల్క్‌ శారీ " మొదట ఈ పత్రికలోనే ప్రచురితమైయ్యాయి.

పత్రిక సామాన్య ప్రజల ఆదరాన్ని సాహితీ వేత్తల ఆమోదాన్ని పోందింది. రాజకీయంగా ప్రజాస్వామ్య, సామ్యవాద సిద్దాంత వ్యాప్తికి కృషి చేసింది. అనేక ప్రత్యేక సంచికల ద్వారా వ్యవసాయ, సహకార, విద్య, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ, పీడిత ప్రజానీకం ప్రయోజనాలకు ప్రాచుర్యం కల్పించింది. అసంఖ్యాక హాస్య వ్యంగ్య రచనల ద్వారా అభివృద్ది నిరోధక శక్తుల కుట్రలు, కుతంత్రాలను బయట పెట్టింది. నైతిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వికాసాలకు పాటు పడింది. జాతీయ, అంతర్జాతీయ సమస్యలను కూడా నిస్పాక్షికంగా విశ్లేషించింది.

పత్రిక నిర్వహణలో పీవీ చందాదారులను చేర్పించడం, రచనలు సమకూర్చడం, ప్రకటనలు సేకరించడం, ప్రూఫ్‌ లు దిద్దడం వంటి అన్ని పనులూ చేసేవారు. అన్నిరకాల బాధ్యతలను నిర్వహించేవారు. ఈ పత్రికకు పీవీ ఆప్తమిత్రులు పాములపర్తి సదాశివరావు గారు సంపాదకులు. గార్లపాటి రాఘవరెడ్డి గారు, కాళోజీ నారాయణరావు గారు పత్రిక నిర్వహణలో సాయపడేవారు.

అయితే, నిర్వాహకులలో వ్యాపార దృక్పథం లేనందున కాకతీయ పత్రికకు ఆర్ధిక పుష్టి సమకూరలేదు. కేవలం నిస్వార్థ సేవా దృక్పథంతో పత్రికను నడిపారు. అందువల్ల రానురాను పత్రిక మనుగడ కష్టతరమై, అనుకోని రీతిలో పత్రిక ప్రచురణ నిలిచిపోయింది.

కాకతీయ పత్రిక నిలిచిపోయి. ఎన్ని దశాబ్దాలు గడిచినా పీవీ లో మంచి సాహిత్య పత్రిక ఉండాలన్న కోరిక మాత్రం సజీవంగానే ఉండిపోయింది. పీవీ గారికి తెలుగు జర్నలిజం పై గాడమైన అఖి'ప్రాయాలున్నాయని పీవీ గారి ఆంగ్ల నవల “ఇ” ను తెలుగులోకి అనువదించిన సీనీయర్‌ జర్చలిస్ట్‌ శ్రీ కల్లూరి భాస్మరం గారు “ప్రతిబా వైజయంతి 2002” లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఆయన పుస్తకం అనువాదం విషయమై పీవీ గారి వద్దకు తరచూ వెళ్తుండేవారు. అలా ఒకసారి వెళ్తూ, తన మిత్రుడు ఒకరిని వెంట తీసుకుని పోయారట. పీవీ గారు మాటల సందర్భంలో తెలుగు సాహిత్యం తీరుతెన్నులు, కవులు, రచయితల గురించి మాట్లాదుతూ “తెలుగులో పత్రికలేవండీ, భారతి లాంటి పత్రికలేమైపోయాయి? మిగతా భారతీయ భాషలలో చూస్తుంటాను, భారతి లాంటి స్థాయి గల పత్రికలు ఎన్నో కనిపిస్తుంటాయి. తెలుగులోనే ఏమి లేని పరిస్థితి ఎందుకొచ్చింది?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారట. అప్పుడు పక్శనే వున్న భాస్మరం గారి మిత్రుడు “తెలుగువాళ్ళు చదవరండీ!” అనేశారట. ఆ మాటకు ఆయన చాలా నొచ్చుకున్నట్లు కనిపించారట. “తెలుగు వాళ్ళ గురించీ అలా అనకండి. తప్పక చదువుతారు” అన్నారట. ఆ మరునాడు మళ్ళీ భాస్కరం గారు కలుసుకున్నప్పుడు కూడా పీవీ గారు ఆ ప్రస్తావన తెచ్చి, “మీ మిత్రుడి అభిప్రాయం చాలా తప్పు. మీరే ఒక మంచి పత్రిక ప్రారంభించండి. నా సహకారం కూడా ఉంటుంది” అన్నారట. తెలుగులో భారతి, త్రివేణి లాంటి పత్రికల అవసరం ఈనాడు ఎంతగానో వుంది. భారతి ఈ శతాబ్దపు తెలుగు వారి ఆస్తి. దాన్ని పునరుద్దరిస్తే మేలు జరుగుతుంది అన్నారట.

పీవీ గారు మారు పేర్లతో ముఖ్యంగా “కాంగ్రెస్ వర్కర్", “కాంగ్రెస్‌ మాన్‌” పేర్లతో సమకాలీన రాజకీయాలపై, నాయకులపై ఎన్నో వ్యాసాలను ప్రముఖ పత్రికలలో రాశారు. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పటికీ, ఆయన ప్రభుత్వం పడిపోయిన తరువాత రాజీవ్‌ గాంధీ తప్పిదాలను, ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోడానీకి గల కారణాలను విశ్లేషిస్తూ ఒక వ్యాసాన్ని“కాంగ్రెస్‌ వర్కర్‌” పేరుతో 1990 జనవరి నెలలో “మెయిన్‌ స్త్రీమ్” పత్రికలో రాశారు.

ఈ వ్యాసంలో ఆయన అయోధ్య సమన్యను పరిష్కరించే విషయంలో రాజీవ్‌ గాంధీ చేతకానితనాన్ని ఎండగట్టారనీ, బోఫోర్స్‌ కుంభకోణం విషయంలో రాజీవ్‌ గాంధీ డబ్బుకు కక్కుర్తి పడివుండకపోవచ్చు. కానీ, ఏవో కాన్ని నిజాల్ని లేదా బాధ్యులైన వారిని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని, పదునైన వ్యాఖ్యలు చేశారు. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నాలుగు వందలకు పైగా స్థానాలు సాధించింది. కాంగ్రెస్‌ చరిత్రలోనే ఇది అసాధారణ విజయం. దేశ చరిత్రలో మరే పార్టీ ఇంతవరకు ఇంతటి ఘన విజయాన్ని సాధించలేదు. ఇందిరా గాంధీ హత్యానంతరం సానుభూతి పవనాలు వీయడం వల్ల లఖించిన విజయమిది. ఇందులో రాజీవ్‌ గాంధీ గొప్పతనమేమీ లేదు. అయితే, ఈ

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

25