పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారితో ఇంగ్లీషులోకి అనువదింవ జేయకపోయారా? అంతర్జాతీయంగా మీకు మంచి పేరు వచ్చేది అని అన్నారట. ఆమె అలాగే అంటే ఆయన కొంచెం ఆలోచించి ఎవరో ఎందుకు? నేనే ఇంగ్లీష్‌ లోకి అనువాదం చేసి పెడతాను లెండి అన్నారట. ఆమెకు గుండెల్లో రాయి పడిందట. పీవీ గారు వచనం అనువదించడంలో ప్రసిద్దులు. ఆయన తన తెలుగు కవితలను ఆంగ్లంలోకి అనువదించగలరా అనుకున్నారట. అయితే కొన్ని రోజుల తరువాత ఆమెను పిలిచి, ఆమె కవితల ఆంగ్ల అనువాద ప్రతిని ఇచ్చారట. ఆ అనువాదాలు చదివి ఆమె ఆశ్చర్యసోయారట. అవి అనువాదాలు వలె కాక, ఆంగ్ల దేశాలకు చెందిన చేయి తిరిగిన ప్రసిద్ద కవి సహజ కవితల్లాగా ఉన్నాయట. అంతకన్నా బాగా ఆంగ్లంలోకి మరెవ్వరూ అనువదించలేరు అనుకున్నారట ఆమె. పీవీ గారి ప్రతిభను తక్కువగా అంచనా వేసినందుకు ఆమె బాధపడ్డారట. తన కవితలు పీవీ గారికి అంతగా నచ్చినందుకు ఆమె హృదయం ఉప్పాంగిపోయిందట.

ఒక భాష నుంచి సాహిత్యాన్ని మరొక భాషలోకి అనువదించడం వల్ల ఆయా సంస్కృతులు ఇతరులకు తెలుస్తాయి. దీని వల్ల భిన్నత్వంలో ఏకత్వం సాధించవచ్చని పీవీ నరసింహారావు గారు చెప్పారు. దేశకాల పరిస్థితుల దృష్ట్వా అది ఈనాటి అవసరమని, ప్రపంచ భాషలలోని మహాకావ్వ్యాలన్నింటినీ రష్యన్‌ భాషలోకి అనువదించడానికి దోహదం చేసిన పీపుల్స్‌ పబ్లిషింగ్‌ హోమ్‌ కార్యాచరణ పద్దతి అందరికీ అనుసరణనీయమైనదని, తెలుగులో ఎంతో విలువైన సాహిత్యం విస్తారంగా వున్నదని, దానిని బయటి ప్రపంచానికి తెలియజెప్పి తెలుగు సాహిత్యం గొప్పదనాన్ని దశదిశలా చాటాలని పీవీ గారు ఎప్పుడూ ఆరాటపడేవారు.

రాష్ట్ర సాంస్కృతిక మండలి, తెలుగు విశ్వవిద్యాలయం వంటి ప్రభుత్వ నిధులున్న సంస్థలు పాఠకులు ఉన్నారా, లేరా? అన్న మీమాంసకు వెళ్ళకుండా గ్రంథాలను ప్రచురించి, మన సంస్కృతిని పరిరక్షించాలని ఆయన అనేవారు.

“పీవీ నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రిగా ఉండగానే ఆ శాఖలో అనువాద విభాగం ఏర్పాటైంది. అంతకు ముందే భారత రాజ్యాంగాన్నీ “భారత సంవిధాన” మనే పేరిట నరసింహారావు గారే తెలుగులోకి అనువదించి వున్నారు. 1963లో కేంద్రం చేసిన అధికార భాషా శాసనంలోనూ, 1966లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన చట్టంలోనూ ఇంగ్లీష్‌ లో వున్న ఏ చట్టాన్నయినా అనువదించి రాష్ట్ర గవర్నరు ఆమోదం పొందిన తరువాతనే అది అధికార పాఠమవుకుంది. దానికి తప్ప న్యాయశాస్త్ర రీత్యా ఇతర విధాన అనువాదాలకు గుర్తింపు లేదు - రాదు. అందువల్ల అనువాద విధానాలను నిర్దేశించవలసిన అవసరం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద వున్నాయి. అప్పటికీ భాషలను గురించి, అనువాద విధానాలను గురించి రకరకాల సిద్దాంతాలు, చర్చలు వున్నాయి. వాటన్నిటినీ సమన్వయము చేయడం సాధ్యం కాదు. అలాగని నిర్ణయాధికారాన్ని కాలానికి వదిలేస్తే ఎన్ని దశాబ్దాల తరువాత, ఎన్ని శతాబ్దాల తరువాత ఏక రూపత, ఆమోద యోగ్యత, ఏక ఐక్యత వస్తాయో ఎవరూ చెప్పలేరు. అందువల్ల ఎదో ఒక విధమైన నిర్దేశం, లక్షణ నిరూపణ చేయవలసిన బాధ్యత న్యాయశాఖ మంత్రి మీద వుంది. ఆ బాధ్యతను నెరవేర్చే సదుద్దేశంతో, తెలుగులో శ్వేత పత్రాన్ని (వైట్‌ పేపర్‌), పరిశీలన పత్రాలను (వర్మింగ్‌ పేపర్స్‌) 1968, 1969 సంవత్సరాలలో (ప్రభుత్వం తరఫున న్యాయశాఖ మంత్రిగా పీవీ గారే తయారు చేసి శాసనసభలో వాటిని చర్చకు పెట్టారు. విస్తృత పరిశీలన కోసం, చర్చా గోష్టులకు తేదీలను కూడా నిర్ణయించారు కానీ 'ప్రత్వేక తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకున్నందువల్ల బహిరంగ సమావేశాలు జరగలేదు”.

(డా. బూదరాజు రాధాకృష్ణ “భాషా సేవకులుగా శ్రీ పీవీ నరసింహారావు గారు” వ్యాసం.

విమర్శకుడుగా పీవీ

ఏది చదివినా వ్రద్దగా చదవడం, చదివిన రచనను లోతుగా విశ్లేషించి, ఆ రచనను విమర్శనాత్మకంగా పరిశీలించడం పీవీ గారికి అలవాటు. విమర్శ విషయంలో ఎంతటి వారైనా ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పడంలో ఏనాడూ ఆయన వెనుకాడలేదు. తెలుగు సాహిత్యంలో హిమాలయ శృంగ సద్భశ్యుడైన విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆయన ఒకసారి విమర్శలో ఢీకొన్నారు.

1956 మర్చి 31 , ఏప్రిల్‌ 1 తేదీల్లో, రెండు రోజులపాటు కరీంనగర్‌ లో విశ్వనాథ షష్టిపూర్తి ఉత్సవాలు జువ్వాది చౌొక్కారావు,గౌతమ్‌ రావు గార్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగాయి. దివాకర్ల వెంకటావధానిగారు, నాయని సుబ్బారావు గారు, ధూళిపాళ శ్రీరామమూర్తి గారు, కాళోజి నారాయణరావు గారు - వంటి ప్రముఖులు ఆ సభల్లో పాల్గొన్నారు. వరంగల్‌ నుంచి కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య కూడా ఈ సభలకు వెళ్ళారు.

“ఆ సందర్భంగా సత్యనారాయణ గారి నవలా సాహిత్యాన్ని గురించి పీవీ గారు తొలి రోజున చదివిన ప్రసంగ వ్యాసం అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్లు చేసింది. సభాసదుల్ని ఆలోచించమని బలవంత పెట్టింది. ఆ సుదీర్ధ వ్యాసాన్నీ విన్నవారు కొందరు సంతోషించారు. కొందరు చికాకుపద్దారు. ఈ రెండు తీరులకూ కారణం, పీవీ ఆ ప్రసంగంలో సత్యనారాయణ గారి నవలల్లో ప్రధానంగా ప్రవేశపెట్టిన కొన్ని పాత్రలు, వాటి చిత్రణలో లోపాల వంటి కొన్ని కొన్నింటిని సందేహాల రూపంలో వేలెత్తి చూపడమే.కొంత ఘాటుగా విస్తరించడమే. ఆ ప్రసంగ వ్యాసం ఆయన ముఖతః ఆ రోజున విన్నప్పుడు శ్రీ పీవీ దృష్టి నైశిత్యం, విశ్లేషణ, వివేచనలోని గాంభీర్యం మొదటిసారిగా నాకు అవగతమైంది” అని డా. కోవెల సంపత్ముమారాచార్య తమ “పీవీ సాహిత్య వ్యక్తిత్వం” వ్యాసంలో పేర్కొన్నారు.

పీవీ తరువాత మరొకరిద్దరు ప్రసంగించిన అనంతరం, చివరకు మాట్లాడిన విశ్వనాథ వారు తమ ప్రసంగంలో పీవీ ప్రస్తావించిన అంశాలకు తమ సాహిత్య జీవితంలో నుంచి, లోకంలో నుంచి పలువురు మహానుభావువైన దేశ విదేశ మహాకవుల, రచయితల రచనల నుంచీ “వేయిపడగలు” మొదలైన నవలలు తాను రచించిన కాల పరిస్థితుల నుంచీ రకరకాల ఉదాహరణలు ఇస్తూ, ఆయా పాత్రలను ఆయా విధాలుగా చిత్రించడానికి కారణాలను, ఔచిత్యాన్ని వివరిస్తూ సుదీర్హంగా ఉపన్యసించారు.

ఆనాటి పీవీ ప్రసంగాన్ని ఆ తరువాత సత్యనారాయణ గారి ఉపన్వాసాన్ని విన్నవారిలో కొందరు పీవీ సత్యనారాయణ గార్ల

తెలుగుజాతి పత్రిక అమ్మ్జనుడి * నవంబరు-2020

24