పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమీకృతవిద్యావిధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ పాఠశాలలు పట్టణ, పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలుగా నడుస్తున్నాయి. అందులోనూ, విద్యార్థుల జనాభా విస్తృ తంగా ఉన్నా ఉన్నతవిద్య పరిమితంగా అందుబాటులో ఉండేటటువంటి విద్యార్థి జనాభానే ఎక్కువ భాగం ఉన్నారు.

మధ్యప్రదేశ్‌లో సెమీ-ఇంగ్లీష్‌ విధానం ఎందుకు ఉండకూడదు?

" ఎరుకువ పెరుగుదలలో (cognitie growth) ఇంటి ఇంకా పొరుగు భాషల పాత్రను అంగీకరించడానికి ఇష్టపడకపోవడమూ ఎరుకువలో పెరుగుదల ఉన్న ఖాషాప్రావీణ్యం భాషల మధ్య బదిలీ కాకపోవడాన్ని గమనించడంలో వైఫల్యం. ”(ఎన్ సిఇఅర్‌టి 2006 ఎI)


ఒక వ్యూహం ద్విభాషా విధానాన్ని స్వాగతిస్తే మరొకటి ప్రాంతీయ భాషకు తలుపులు మూసివేస్తుంది. హిందీని నిషేధించాలనే వికృత అలోచనా వ్యాప్తి ఎం.పీ.లో భాషను నేర్చుకోడానికి సంబంధించి అనేక చిక్కులు పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు, దేవాస్‌ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామీణ (ఫైవేట్‌ హిందీ మీడియం పాఠశాల గత పదిహేనేళ్ళులో గ్రామంలో నెమ్మదిగా స్థిరపడి, నేడు ఇంగ్లీష్‌ మాధ్యమానికి మారే ఒత్తిడిలో ఉంది. చుట్టుపక్కల వాతావరణంలో ఇంగ్లీష్‌ ఎక్కడా లేకపోయినా నేర్చుకోవాలనేవారి కోరిక బలంగా ఉంది. ఈ పాఠశాలపై ఒత్తిడి తల్లిదండ్రుల నుండి ఇంకా గ్రామానికి చుట్టుపక్కల ఉన్న పెద్ద ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలల పోటీ నుండి వస్తోంది. ఈ పాఠశాలల్లో కొన్ని పైన పేర్మాన్న విధంగానే అనుసరిస్తాయి. పాఠశాలలో హిందీ నిషేధించబడింది. ఈ విద్యార్థుల ఇంటి భాష మాళవి అయినా, ప్రాంతీయ భాషగా హిందీనే అందరూ మాట్లాడుతారు. ఈ ప్రైవేట్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ ఉపాధ్యాయుడిగా తన అనుభవం ద్వారా, ఇంగ్లీషును ఒక సబ్జెక్టుగా కలిగి ఉండటం సరిపోతుందని నమ్ముతారు. గ్రామంలో పిల్లలను తీసుకెళ్లడానికి మినీ బస్సు సేవలను అందించే ఈ పెద్ద ఇంగ్లీష్‌ మీడియం ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నత కుటుంబాల నుండి వచ్చిన తన విద్యార్థులను వేటాడతాయని అతను అందోళన పడుతున్నాడు. ఈ గ్రామానికి చెందిన 7 వ తరగతి విద్యార్థిని, ఈ పెద్ద ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివి కూడా ఆమె సైన్స్‌ పాఠ్యపుస్తకాన్ని అర్ధం చేసుకోలేదు. ఈ గ్రామానికి చెందిన మరో విద్యార్థిని 8 వ తరగతి తరువాత ఈ పాఠశాలలో తట్టుకోలేమని ఆమె తల్లిదండ్రులు భావించి ప్రభుత్వ హిందీ మీడియం ఉన్నత పాఠశాలకు తరలించారు. ఇలాంటి విషయంలో పిల్లవాడిని నిందిస్తారుగానీ కానీ పాఠశాల వాతావరణాన్ని కాదు.

ఈ పాఠశాలల ప్రధాన ఆలోచన హిందీనీ తరగతి గది భాషగా నిషేధించి వీలైనంత త్వరగా ఇంగ్లీషును ప్రవేశపెట్టడం. మరొక గ్రామంలో, కొంతమంది గ్రామ నాయకులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రిన్సీపాలతో మాట్లాడి అనధికారిక ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా వారు దేవాస్‌ పట్టణానికి చెందిన ఇద్దరు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

12