పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇతర రాష్ట్రాల్లొ పాఠశాల విద్య

అరవింద్‌ సర్దానా


ఇతర రాష్ట్రాల్లొ

పాఠశాల విద్య


మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్‌ సెమీ-ఇంగ్రీష్‌ పాఠశాలల

నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే పూనుకొని పాఠశాల విద్యను పూర్తిగా ఆంగ్లమాధ్యమంలోకి మార్చివేయడానికి ఉత్తర్వులనివ్వడమూ, చివరకు ఉన్నత నాయస్థానాన్ని ఆశ్రయించడమూ- ఇదంతా చదువరులకు తెలిసిందే. దీనిపై 'అమ్మనుడి'లో ఏంతో సమాచారాన్నిస్తూనే ఉన్నాము. పొరుగునున్న తమిళనాడులో అంగ్ల మాధ్యమం ఎలా ఎదురుదెబ్బలు తింటున్నదీ నవంబరు సంచికలో ఇచ్చాము. ఆ వ్యాస రచయిత్రి- అంజలీ మోదీ. ఈ పేరుకు బదులుగా పొరపాటున అరవింద్‌ సర్దానా అని ముద్రితమైంది. ఇప్పుడు అరవింద్‌ సర్దానా పరిశోధనాత్మక రచనను ప్రచురిస్తున్నాము. ఇందులో మహారాష్ట్ర మధ్యప్రదేశ్‌లలో పరిస్థితులను ఆయన వివరంగా చర్చించారు. చదవండి, చర్చించండి.

శ్రీ అరవింద్‌ సర్దానా “ఏకలవ్య సోషల్‌ సైన్స్‌" బృందంలో మూడు దశాబ్దాలుగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని కార్యక్రమాలతోపాటు ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి (జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ సంస్థ్ర)లో 2006-09లలో సామాజికశాస్త్రంలో కొత్త పాఠ్యపుస్తకాలను అభివృద్ది పరచడంలో సన్నిహితంగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణల్లోను, ఇతర రాష్ట్రాల్లోను, 2005 జాతీయ కరిక్యులం ఫ్రేంవర్క్‌ (ఎన్‌సియఫ్‌- జాతీయ పాఠ్యప్రణాళిక రూపకల్చన) తర్వాత కొత్త పాఠ్యపుస్తకాల నిర్మాణంలో భాగం పంచుకొన్నారు.

చాలా ప్రభుత్వాలు ఆంగ్ల విద్య పట్ల తమ విధానాన్ని ప్రకటిస్తుందగా మరికొన్ని ప్రభుత్వాలు తమదైన మార్గాలను ఎంచుకున్నాయి. తల్లిదండ్రుల పేరిట చేసిన ఎంపికలో అస్పష్ట, అనర్ధదాయక ఆలోచనా పరిష్కారాలు ఉన్నాయి. అన్ని తెలుగు మీడియం పాఠశాలలనూ ఇంగ్లీష్‌ మాధ్యమంలోకి మార్చాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఇటీవల ఏ.పి. హైకోర్టు రద్దు చేసింది. ఏ.పి.ప్రభుత్వమూ ఇతరులూ దీనీనీి సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడం కంటే ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీనుకొని మథ్యే మార్గాన్ని ఎన్నుకోవాలి. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే విధానపరమైన సహేతుకమైన ఎంపికలను పరిగణనలోకి తీసుకొనే సామర్ధ్యాన్ని కార్యనిర్వాహకులు కోల్పోకూడదు. మహారాష్ట్రలోని సెమీ-ఇంగ్లీష్‌ పాఠశాలల మధ్యేమార్గ విధానాన్ని బోధనా అవగాహన ఇంకా బహుభాషా వనరులతో స్వీకరించవచ్చు. సరైన భాషా విధానానికీ దాని ఆచరణకూ మధ్య ఇతర వారధులు ఉండవచ్చు.

'మహారాష్ట్రలో సెమీ-ఇంగ్లీష్‌ మాధ్యమ తీరుతెన్నులూ

మహారాష్ట్రలోని చాలా పాఠశాలలు చాలా కాలంగా "సెమీ ఇంగ్లీష్‌" అనే ప్రమాణాన్ని పాటిస్తున్నాయి. ఈ పాఠశాలలు మరాఠీ మాధ్యమం అయినా పాఠశాల మథ్య స్థాయిలో సైన్స్‌ మరియు మ్యాథమెటిక్స్‌ కోనం ఇంగ్లీషులో పాఠ్యవుస్తకాలను ప్రవేశ పెడుతుంటాయి. మొదట్లో ఆ ప్రభుత్వ సహాయంతో నడిచే (ఎయిడెడ్‌) పాఠశాలలు, తాలూకా, పట్టణ, పట్టణాలకానుకొన్న ప్రాంతాలకు పరిమితం చేయబడ్డాయి. ఈ ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలను స్థానిక ట్రస్టులు నిర్వహిస్తున్నాయి. ఇటీవలే 2005 తరువాత రాష్ట్రంలోని అనేక వ్రభుత్వ పాఠశాలలకు ఈ సెమీ ఇంగ్లీష్‌ విధానాన్ని అనుసరించడానికి అనుమతి ఇవ్వబడింది. ఈ (ప్రమాణం నేడు గ్రామీణ పాఠశాలలకు వ్యాపించి, ప్రభుత్వ పాఠశాలల నుండి నిష్క్రమణను కొంతవరకు ఆపగలిగింది. రెండు దశాబ్దాల క్రితం మహారాష్ట్రలో కొంత దూరంగా ఉన్న తాలూకా ప్రాంతాలలో, అక్మడ ఉండే తల్లిదండ్రులకు ఇంగ్లీషు సహాయాన్ని అందించగల నేపథ్యం లేదు. ఇంగ్లీషులో పుస్తకాలు లేవు. ఇక్కడ ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలో “సెమీ ఇంగ్లీష్‌" ఏమి సూచిస్తున్నది? ఈ పాఠశాలల్లో మధ్యస్థ స్థాయిలో సైన్స్‌ ఇంకా మ్యాథమెటిక్స్‌ పాఠ్యపుస్తకాలు ఇంగ్లీషులో, ఇతర సబ్జెక్టులు మరాఠీలోనే ఉంటాయి. ఇంగ్లీష్‌ కూడా ప్రత్యేక సబ్జెక్టుగా బొధించబడుతుంది. ఈ పిల్లల ప్రాథమిక విద్య వారందరికీ ఇంటి భాష లేదా ప్రాంతీయ భాష అయిన మరాఠీలో ఉండేది. మరీ ముఖ్యంగా తరగతి గది సంస్కృతి మరారీ లో ఉంటుంది. అంటే వివరణలూ ప్రశ్నలూ సంభాషణలూ మరాఠి భాషలోనే ఉంటాయి. ఉపాధ్యాయులు పాఠాన్ని ఇంగ్లీషులో చదివి మరాఠీలో వివరిస్తారు.

బోధనా విధానం చాలా సాంప్రదాయకంగా ఉన్నప్పటికీ, ద్విభాషా సాంస్కృతిక ప్రక్రియ అంతటా అంగీకరించబడింది. పిల్లలు ఇంగ్లీషు పాఠాలను చదవడానికి ప్రయత్నం చేసి, మరాఠీలో పదాల అర్జాన్ని రూపొందించడంలో ఆలోచించడం అలవరచుకుంటారు. ఈ రోజు నా తోటి ఉద్యోగులైన ఈ పాఠశాల పాత విద్యార్థులు కొందరితో మాట్లాడితే, ఎవరైనా ఇట్టే చెప్పొచ్చు ఈ పాఠ్యపుస్తకాలను చదవడం వారికి అంత సులభం కాదని. కష్టమైన పదాల అర్జాలను గుర్తించడం, పదాలను కంఠస్థం చేయడం, అదే సమయంలో ఆంగ్లంలో సమాధానాలు రాసేపని లాంటి భయపెట్టే ప్రక్రియలతో వారు కష్టపడ్డారు. ఏదేమైనా, ప్రవేశపెట్టబడిన కొత్త భాషతో క్రమంగా పరిచయం పెరగడం, ఎక్కువగా పాఠ్యపుస్తకాలూ ఉపాధ్యాయుల

తెలుగుజాతి పత్రిక 'అమ్మనుడీ * నవంబరు-2020

10