పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

37


"బరమేష్ఠి గురు శక్ర పావ[1] కార్క్యసుర
వరుణ మారుత యక్షవర రుద్రులార !
కడుదురవస్థయుఁ, గార్యదాహంబుఁ
బొడమెడు మీముఖంబుల నాకుఁజూడ;
వచ్చినపని యేమి వ్రాక్రువ్వుఁ? డిప్పు
డచ్చుగాఁ దీర్చి మీయడలు వారింతు.”
నని యానతిచ్చిన యాదేవుపలుకు
విని, యటు శారదావిభుఁడు కేల్మొగిచి:
"అధ్యాత్మవేద్య, నీయంతరంగమున
బోధ్యంబు గానిది భువిలోనఁ గలదె!
శ్రీవర, యడుగంగఁ జిత్తగించితిరి;
గావున, వినుపింతుఁ గల తెఱంగెల్ల."
నని యింద్రుఁ డుర్వి కేఁగినను దూర్వాసుఁ
జెనకి యాతనిచేతఁ జేటొందినట్టి
విధమంతయును విన్నవించిన, నపుడు
మధుదైత్యమథనుఁ డామఘవు నీక్షించి :
"యేమి దేవేంద్ర, నీ వెఱుఁగవే యకట!
యామూర్ఖు (నతి)క్రూరుఁడని జనుల్ పలుక.
పిన్నబిడ్డవె నీవు! పెరిమె వెన్నడచి
నిన్నింక బుద్ధులు నేర్పెదమన్న!
నొకయొకవేళ మాయున్నెడ కతఁడు
వికలుఁడై యున్మత్తవిధమున వచ్చు;
నప్పుడు నేమెల్ల 'నాకుటిలాత్ముఁ
డెప్పుడు పోవునో యిట' నని యాత్మ
జలదరింతుము; గాని, స్వస్థత మదికి

గలుగ దాతపసి దిగ్గనఁ బోవుదాఁక
  1. నైకసుర (మూ )