పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


గనుఁగొని యేగుచోఁ, గమలసంభవుఁడు
నెనసిన వేడ్కతో నింద్రున కనియె:
"చూచితె యింద్ర, విష్ణునిమహామహిమ!
యీచందమని తెల్ప నెఱుఁగంగ రాదు.
అనయంబు విష్ణుదివ్యాలయంబులకుఁ
గనుకని నేఁగి కైంకర్యంబు చేసి,
దేహాభిమానముల్ దిరుగంగ విడిచి,
మోహతృష్ణాదులు మొదలంటఁ బొడిచి
చరియించునట్టి సజ్జనుఁ డందుసుమ్ము
వరుసనెయున్న పావనశుభోన్నతులు.
దారిద్య్ర[1]శోకసంతాపంబు లొకటఁ
జేరిన నందుచేఁ జీకాకుపడక,
ధనధాన్యములు [2]సోఁకు దశలకుఁ బోక,
తనరెడు హరిభక్తి ధనముగా వెలయు
నసమానధన్యాత్ములగువారు సుమ్ము
పొసఁగ నీయున్న సత్పూజ్యులు వజ్రి!
ఒలయ నేకాదశి నుపవాసముండి,
పొలుపుతో ద్వాదశిపొద్దు సాధించి,
భూసురారాధనంబులు చేసినట్టి
భాసురచరితు లీభవ్యాత్ములెల్ల.
జప తపస్ స్వాధ్యాయ సర్వధర్మాత్మ
విపులకర్మంబుల విసువున విడిచి,
యనయంబు శైవదూషణమాని, కీర్తు
లొనరంగ వెలసిన యుత్తముల్ వీరు.
[3]కుడువఁ గూడును, గట్టఁ గోకయు లేక
బడలిన హరిభక్తిపరులఁ జేపట్టి,

  1. లోక
  2. లోకు
  3. కడుపెద్దలై గూడ కట్టకోకలును(మూ) దీనిని"కడుపేదలై కూడుఁ గట్టగోకలును " అని సవరించుట మూలమునకు చాల సన్నిహితముగానుండును; కాని, ఆసవరింపుసైతము కొంత అనన్వితమగుటచే, మూలదూరమయ్యు దీనిని అంగీకరింపవలసివచ్చెను.