పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


“కటకట! దూర్వాసు కడుమొక్కలీఁడు!
కుటిలుండు! నన్నుఁ గైకొనఁడు చీరికిని!
ఆనిష్ఠురాత్ము [1] నిట్లతకరింపుదురె !
నేను నిన్నేమననేర్తు నోయింద్ర!
ఎడపక క్రూరమృగేంద్రునికోర
లడరునుధ్ధతిఁ [2]జేత నాడించియైన,
మదతరంగితతీవ్రమాతంగవిభుని
గదిసి తుండాగ్రంబుఁ గబళించియైనఁ,
గలిత [3]క్షుధార్తఋక్షంబు మీసముల
నలపడఁ బొదివి యుయ్యల లూగియైన,
నుదితకోలాహలాత్యుగ్రకాలాహిఁ
బదమునఁ గ్రౌర్యమొప్పఁగఁ దన్నియైన,
నలఘుకీలానికాయాభీలమైన
ప్రళయానలంబులోపలఁ జొచ్చియైన
గ్రమ్మఱఁజని బ్రదుక గాఁబోలుఁ; గాని,
యమ్మూర్ఖుఁ జెనకి యెయ్యెడ బ్రదుకవశమె!
వఱలంగఁ బదివేలువచ్చెఁ! జాల్చాలు!
మఱియొండనాక యీమాత్రనె విడిచె!
ప్రాణంబలుండ సంపదలేమిదొడ్డు!
త్రాణయై మనకు నారాయణుండుండ.
ఆ దేవుతోడ నీయాపద లెల్ల
నాదట వినుపింత మటకుర"మ్మనుచుఁ
జతురాస్యుఁ డాసభాసదుల వీడ్కొల్పి,
హితబుద్ధి నమరుల నెల్లఁ దోడ్కొనుచు,
మాకాంతునకు నిత్యమందిరంబైన

వైకుంఠపురవరద్వారంబు చొచ్చి,
  1. నిట్లధికరింపుదురె
  2. చేరి యడరంగియైన
  3. క్షుధాతవక్షంబు (మూ)