పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

23


యామునీశ్వరుఁడిచ్చు నలరులదండ
ప్రేమతోనంది యాత్రిదశనాయకుఁడు
కడఁక నైరావతకంఠ దేశమునఁ
దడయకవైవ, నాదండతావులకుఁ
గలగొని చంచరీకములు ఝంకార
ములతోడ నటచుట్టుముట్టి కాఱింప,
నుడురాజబింబంబునుండి చలించి
కడుఁజుట్టుముట్టు చీకటిగుంపులట్లు
అలులతండము లసంఖ్యములుగా మూఁగి
పలుచందములఁ జెవుడ్పడఁగ మ్రోయఁగను,
దగ మును కటయుగ (దాన) ధారలకు
మిగులఁ గాఱించుతుమ్మెదలకుఁ దోడు
దండతావులకు నుద్దండతఁ బొలయు
గండుతుమ్మెదలచేఁ గాసిలి యలసి,
చయ్యన నాదిగ్గజము కరాగ్రమున
నయ్యలరులదండ నవలీల నొడిసి,
మొరయుచు [1] నెలతేఁటిమొత్తంబులెల్లఁ
బరచి దిక్కులఁ బటాపంచలై చెదర
బిట్టుగా నింగికి బిరబిరఁద్రిప్పి,
'యిట్టిచందమున సురేంద్రునిలక్ష్మి,
భ్రమణంబుతో నేలపాలగు నేడు
కొమరువో' నన్నట్లు కుంభినివైచి,
మండి [2] గాఢత దంతమండలిఁ గ్రుమ్మి,
తొండంబుచే వెండి తోడనె యెత్తి,
యొక్క కాలునఁ ద్రొక్కి యుద్ధతిఁ ద్రుంచి,
చిక్కుగా నలినలి చిద్రుపలై దొరఁగఁ
బటుభంగి నిలఁబెట్టి పదములఁబ్రామి,
చటులత రూపనాశంబు గావించి,

  1. నెలదిండి.
  2. గాదల (మూ)