పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

ద్విపద భారతము


నన లార్కి రాక్షసేంద్రాప్పతి వాయు
ధనద శంకరులు, ముదంబుతో మేష
కాసర మానవ ఘననక్ర హరిణ
భాసురాశ్వోక్ష సంపద లెక్కి నడువ,
నసమానముగ సిద్ధ యక్ష , గంధర్వ
పసు రుద్రసాధ్య గీర్వాణ కింపురుష
కిన్నర మరు దశ్వి ఖేచ రాదిత్య
పన్నగ గుహ్యకప్రవరులు గొలువ,
[1]వరవీరు లగు చక్రవర్తులు, రాజ
వరులును సంప్రీతి వరుస సేవింప,
సనుపమి తో చ్చైశ్ర, వాశ్వరత్నంబు
మునుకొని పడివాగె ముందఱ నడువఁ,
గదిసి నిర్జరలోక కంచుకిజనము
ముదముతో నోంకారముఖరులై కొలువ
నేతెంచు నమరేంద్రు నీక్షించి, యర్థి
నాతఱి దూర్వాసుఁ డట నెదురేఁగి,
పోలంగ నాననాంబుజము నిక్కించి,
లీలఁ జేతులుదోయిలిగఁబట్టి చాచి :
"దిగ్విజయోస్తు ; తే దీర్ఘాయురస్తు ;
ప్రాగ్వర, సంకల్పఫలసిద్ధిరస్తు ".
అని యిట్లుదీవించి, యధిపుల గురులఁ
గని రిత్తకేల డగ్గఱరాదుగానఁ,
దనచేతనున్న మందారప్రసూన
ఘనతరదామంబు కాన్కగా నొసగ'
'మునిలోకవర్య, నమోనమో' యనుచుఁ
గొనకొని చేతియంకుశ మొయ్యఁ జూచి,

  1. వరతరు.(మూ)