పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

21




ఓజమై జరయుఁ జావును దెవుల్ లేని
భోజనంబమరు నేపుణ్యభాగునకు
నా నిత్యశుభ సాంద్రుఁడగు నమరేంద్రుఁ
డానందకందళితాత్మకుండగుచు
దనవేయి గన్నులఁ డనరుదీధితులు
నినుసారి పగలు వెన్నెలలు గావింపఁ ,
దనమౌళిరత్న సంతాన ప్రభాళి
యిన కిరణాళితో నీడు జోడాడఁ,
దనచేత విలసిల్లు దంభోళిధార
ఘనతర దుష్టశిక్షకుఁజాలి .....
దనపాదములు దేవతాకోటి మకుట
వినుతరత్న ప్రభా వితతి వెలుగఁ .
దనయొప్పిదము దివ్య తరుణీ కటాక్ష
జనిత తృష్ణలకు నుజ్జ్వలభుక్తి నొసఁగ ,
దనయశోరమను గంధర్వకిన్నరులు
మునుకొని కై వారములు బిట్టు సేయ,
లాలితోజ్జ్వల చంచలాలతా కలిత
కైలాస భూధర క్రమమునఁ బొలుచు
సలలిత కనకభూషణ కాంతిజాల
విలసితంబై జగద్విఖ్యాతి నొప్పు
ధళధళమను [1]. చతుర్దంత కాండములు
గలిగినయట్టి దిగ్గజముపై నెక్కి,
సముదీర్ణ కంకణ ఝణఝణారావ
కమనీయ సురవధూకర [2]2 వీజ్యమాన
బహుళచామర [3]జాతపవన సంచలిత
మహనీయకుండల మండితుండగుచు,
నతిసమున్నత మౌక్తికాతపత్త్రంబు
నతులితస్థితి నభంబంతయుఁ బొదువ,

  1. చుదుర్దంత
  2. దీప్యమాన
  3. శాత (మూ)