పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

19


నరుదుగాఁ బుత్రార్థియై యొక గ్రుడ్డు
తెరలుచు నవియించె దెఱప నేరమిని.
ఆయండమున నొక్కఁ డర్ధశరీరుఁ
డై యుదయించి, తా నతికోపుఁడగుచుఁ :
"గడుపూర్ణ దేహునిఁ గాకుండ నన్ను
నడరుచు నడుమ సండము వ్రక్కలించి
వికలశరీరుఁ గావించితి; గాన,
సకలవిస్ఫూర్తి నీసవతికి నీవు
దాసివిగ;" మ్మని తనుగన్న తల్లి
నీసున శపియించి యిట్లనిపలికె :
అమ్మ, యీ రెండవయండంబునందుఁ
గ్రమ్మనఁబుట్టు సఖండవిక్రముడు
చెలువొంద నీదుదాసీత్వంబుఁ బాపి
వలనొప్ప రక్షించు; వగవకుమింక ;
నయ్యండ మది తానె యవియని"మ్మనుచుఁ
జయ్యనఁజని, యర్క సారథియగుచు
నెమ్మి ననూరుండు నిజశక్తినుండె.
[1]అమ్మగువయును నన్యాండంబు నంత
నతులయత్నమ్మున నరయుచు, మిగుల
జతనంబుగాఁగ నిచ్చలుఁ బ్రోచుచుండె.

కల్పకుసుమదామ ప్రదానము

ఉర్విలో నటమున్నె, యుగ్రకోపనుఁడు
దుర్వాసుఁడనుముని దొరయనేతెంచి
చరియించుచును, నొక సమయంబునందుఁ
దరణితేజుఁడు తిలోత్తమయనుపేరి

 

  1. అమ్మగువయు నంత సయ్యన్యయండ. (మూ )