పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

ద్విపద భారతము


తరుణులిద్దఱుఁ దమతమ నివాసముల
కరిగి వేడుకనుండ, నాసమయమున
నాహారములఁ గాంక్ష లల్ప౦బులయ్యె
దేహవల్లులు పాండు దీధితులయ్యె ;
నారులుపొదలె; మధ్యంబు లొయ్యొయ్యఁ
దోరంబులై యొప్పె[1] దొరఁకొనెనలత;
వళులు జీర్ణంబయ్యె ; వరముఖాబ్జములు
కళ లేదె; [2]మనము లొక్కట బీతువాఱెఁ;
బొలుపుదీపింప నాభులు వికసించెఁ ;
బులుసులపైఁ జాలఁ బుట్టెఁ బ్రేమంబు ;
పలుమాఱు మృత్తికాభక్షణం బొదవెఁ;
దలకొని చిట్టముల్ తఱుచుఁగాఁదొడఁగె.
నీరీతి నయ్యింతులిద్దఱు గర్భ
భారంబుదాల్చి, యొప్పగుసురక్షితము
గావించుచుండఁ, దద్గర్భమ్ముల౦దు
భూవినుతంబుగాఁ బుట్టె నండములు ;
పుట్టిన, నవి కుండములలోనఁ బ్రీతిఁ
బెట్టి రక్షింపంగఁ బెరిగి నొండొండ
సరవియేర్పడఁ బంచశతవత్సరమ్ము
లరయంగఁ, గద్రువయండంబులెల్లఁ
దఱితోడ నందంద తముతామ యవిసి
సొరిదిమై శేష వాసుకి తక్షకాదు
లగుమహాభుజగంబు లందుఁ బుట్టుటయుఁ,

అనూరు జన్మవృత్తాంతము

దగవేది వినతయుఁ దనదుగర్భమునఁ
బుట్టినయండము ల్పొదలమిచూచి,
చిట్టాడువగపును సిగ్గును బెరయ,

  1. తురకొనెనెలంత
  2. బిసము. (మూ)