పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


ఏ వేదములు పఠియించుటకంటె,
నే వెంటఁ దీర్థంబులేఁగుటకంటెఁ,
బాపహరంబైన పంచమవేద
మే పార వినిపించి యేఁ బుణ్యుఁడగుదు.

ఉదంకుఁడు జనమేజయునియొద్ద కేఁగుట .

వినుఁడు, భారతవంశ విఖ్యాతుఁడైన
జనమేజయుఁడు తొల్లి జగతియేలుచును,
అతిరాత్రమనుయాగ, మశ్వమేధంబు,
ధృతి వాజపేయంబు, దీర్ఘసత్రంబు
మొదలైన యధ్వరంబులు పెక్కుచేసి,
సదమలచిత్తుఁడై సద్గోష్ఠి నుండ,
నా రాజుకడకు నుదంకుఁడన్మౌని
యారూఢనియతిఁ గార్యార్థియై వచ్చి,
యధిపుచేఁ బూజితుండై, యాతఁడిచ్చు
బుధయోగ్యపీఠకంబునఁ గూరుచుండి,
కన్నులఁ గోపాగ్ని గదుర నిట్లనియె:
'జన్మంబున్న్నియు జననాథ, యేల !
పగవగయైయుండ భండారమెల్ల
జగతీశ, తగనివెచ్చంబుచేసెదవు !
వ్రతధారివై చేయవలసినయట్టి
క్రతువుండ, వేఱొకక్రతువేల నీకు !
తరమెఱుంగక కొండ తప్పఁగానేసి (?)
ధరణీశ, వెండ్రుకదాఁకనేసెదవు.
[1] నడికెదు కటకటా! ననువంటిమునివె !
వెడ నీకు గోపంబు వెదకిన లేదు!
తక్షకుండనుపాము తనవేఁడితోర
దక్షతఁగఱచి మీతండ్రినిఁజంపె.
 

  1. నడినేదు శలంకదీ ననువంటి మునివె. (మూ)