పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/688

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

622

ద్విపద భారతము.


యెసగె నుల్కాపాత మెంతయు దివిని;
అసమాన విద్యుత్సహస్రంబు దోచె;
పర్వంబులేకయే పట్టె భాస్వంతు
దుర్వారశక్తితోఁదొనె రాహువును;
భూకంపమయ్యె; నప్పుడు సభవారు
నాకంపమునుఁ బొంది యటనున్నతఱిని,
బలికె నారదుఁడు సభాస్థలి వినఁగ
నలఘువాక్యముల నత్యద్భుతంబుగను :
"పదునాలుగగునేఁట భారతరణము
త్రిదశులెఱుంగఁగ ధీరతనగును;
పాండవేయులు ప్రతాపంబు రెట్టించి
చెండుదు రతిశక్తి [1]చెంది కౌరవుల;
విజయలక్ష్ములయందు వెలసియుండుదురు
భజనకెక్కినయట్టి పాండునందనులు
ఇదియథార్థం." బని యేఁగినపిదప:
'మదచిత్తుఁడగు కురుక్ష్మాపతికతన
నేయరిష్టముపుట్ట నిటమీఁదఁగలదొ!
పాయక.' యనుచుఁ గంపమునొంది కుంది
మదిలోనశంకించి మంత్రరక్షకుని
విదురునిఁబిలిచి భావించి యాలోన
ధృత రాష్ట్రుఁడంతటఁదెలిసి యిట్లనియె:
"నతిపుణ్యులైన ధౌమ్యాదులు గొలువఁ
బాండునందనులు ద్రౌపదిఁగూడి యెచట
నుండంగఁబోయిరి? యుచితమార్గమున."
అనుటయు విదురుండు నాధృతరాష్ట్రు
మనుజేశ్వరునిఁజూచి మహిమనిట్లనియె:

  1. చెది (మూ)