పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/685

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

619


అతులశోకాక్రాంతయగుచు నిట్లనియె:
"సుతులార, భానుతేజోమూర్తులార,
కదిసి మీ తేజంబు గాంచకముందె
సద [1]యాత్ముఁడైన మీజనకుఁడుత్తముఁడు
పాండుభూవిభుఁడేగెఁ బర్జన్యపురికి ;
నుండితినేటికి నుర్విలోపలను !
భర్తతోడనెగూడి పరలోకమునకు
స్ఫూర్తి నేఁగఁగనైతిఁ బుణ్యంబుతోన ;
మీమనోవ్యథలు పేర్మిని జూడవలసె
నేమి సేయుదు ! " నని యేడ్చుచునుండి
యెల్లవారునెఱుంగ నిట్లనిపలికె:
"బల్లిదులై ప్రతాపమున శోభిల్లు
పాండవేయులకునే బహుళదైన్యమున
నొండొండ వర్తింపుచుండంగవలసె;
ఓపుండరీకాక్ష, యోరమాధీశ,
యోపుణ్యమూర్తి, నీలోత్పలవర్ణ,
కరుణించు వీరలగౌరవంబునను;
నిరతంబు నీపాదనీరజాతములు
గొలుచుచున్నారు గైకొనిప్రోవఁదగును
విలసితంబుగ. " ననివేఁడియు మఱియు
" గాంగేయకుంభజ గౌతమ విదురు
లాంగికులుండంగ నక్కట ! యిపుడు
పాండుసూనులకు నాపదపొందవలసె
మండలంబునను సన్మానంబులేక ;
యురుదోషములకెల్ల నొడిగట్టినాఁడు
కురురాజు; సభవారు గొంకిరిమిగుల.”

  1. యాంగు. (మూ)