పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/683

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

617


బొదివి భీష్మద్రోణభూరికృపాది
విదురాంబికేయుల వీడ్కొనిపోవ,
నెదుట ధర్మజుఁజూచి యెంతయుఁబొగిలి
విదురుండుపలికె వివేకంబుతోడ :
"కాంతారములకు నేఁగఁగలేదు కుంతి
సంతతవ్రతశీల సాధ్వి కల్యాణి ;
అరసి పూజించెద నతిభ క్తియుక్తి
సరసత మద్గృహస్థలియందు నిలుపు ;
ధరవర్తనుఁడవు తర్కింపనీవు ;
దుర్మదారాతి సింధురమృగేంద్రుండు
భీముండు సంగ్రామభీముండు ఘనుఁడు ;
భీమానుజుఁడు రిపుపృథివీత లేశ
నికరవిదారుండు నీతిసాహసుఁడు;
నకులుఁడు శత్రుభూనాథభంజనుఁడు
కారుణ్యనిధి బంధుకల్ప [1]భూరుహము ;
ధీరుండు మఱి సహదేవుఁడుత్తముఁడు
పరమవిజ్ఞానసంపన్నుండు ఘనుఁడు;
తరుణిద్రౌపది దయాధర్మంబులందు
వెలసినసతి ; గాన విశ్వభూస్థలిని
బలియురు మీరలు భాగ్యవర్తనులు;
ఇతరులు మిము గెల్వ నెవ్వరు లేరు ;
వ్రతయుక్తు లనఘులు వ్యాసశిక్షితులు
విక్రమక్రములు గోవిందరక్షితులు;
శక్రునిగురువుతో సరియైనవాఁడు
ధౌమ్యుండు మీకు నుత్తమపురోహితుఁడు ;
సౌమ్యులు మీరు రాజశ్రేణిలోన

  1. భూజనుండు. (మూ)