పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/681

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

615


నణఁచుటయే నీతియని దేవమంత్రి
ప్రణుతికెక్కఁగఁజెప్పెఁ బర్జన్యునకును ;
సంతసంబునఁ బాండుజననాథసుతుల
కెంతమేలొనరింప హితులమా మనము !
పాములనలిగించి పటుకంఠమునను
సోమించి విడిచినచొప్పున మనము
నాసమయంబున నటువోవవిడిచి
మోసపోయితిమి భూములవార లెఱుఁగ.
వాసవి విల్లు తీవ్రముగఁబట్టినను,
భీముఁడుగదగొన్న , బిరుదులై కవలు
భీమాయుధంబులఁ బెరిమఁబట్టినను
హరిహరబ్రహ్లాదులైనను వారి
నరుదుగా సాధింవ ననిమొనలేరు;
కావున వారి వేగమునరప్పించి
ప్రావీణ్యమునను [1]బాపద్యూతమునను
గెలిచి పాండవులను క్షితివెడలంగ
నలుకతోఁ ద్రోవంగ నారూఢివలయు. "
ననుటయు ధృతరాష్ట్రుఁ డటుసమ్మతించి
మొనసి పునర్ద్యూతమును నాడఁదలఁచి

పునర్ద్యూతము ; అరణ్యగమనము

ప్రాతికామినిబంచెఁ బాండునందనులు
ఏ తేర సభకును హితవాక్యములను (?)
వాఁడుఁ బాండవులను వరుసతోఁ బిలువఁ,
బోఁడిమి ధృతరాష్ట్రుభూవరునాజ్ఞ
నరుగుదెంచిరి లీల హస్తినాపురికి ;
సరవిఁ దొల్లిటియట్ల సభపెద్దలెఱుఁగ

  1. అనుద్యూతమని. నన్నయ. పునర్దీవ్యాయభద్రంతే. అని. వ్యాస. భా.