పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/677

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

611


కురువీరులెల్ల [1]సంకోచంబులేక ;
పరమార్థమిదియుఁ దప్పదు చిత్తగింపు."
మనవిని ధృతరాష్ట్రుఁ డంతరంగమున
నినిచినభీతితో నిట్టూర్పుపుచ్చి
తతితోడ నట సుయోధనుని రప్పించి
చతురోక్తినిట్లనె సభయెల్లవినఁగ :
"సతతంబుఁ బాండురాజాత్మనందనుల
మతివిచారింపక మఱచితి తప్ప ;
పరమపతివ్రతఁ బాండవసతిని
వరతపస్విని సత్యవతిఁ బుణ్యసాధ్వి
నిజగుణాకర నయోనిజఁ గంబుకంఠి
రజనీకరానన రాజీవనయన
మానవభామగా మదిలోనఁదలఁచి
మానవ, నీనవమాన మీసభను
జేసితి; దోషంబుఁజేసితివీవు ;
చేసితి దప్పంగఁ; జేసితికీడు;
పాపాత్ములను గూడి బాల్యంబునాఁటి
[2]చాపల్యమును మానఁజాలవు నీవు.
నీవుపుట్టఁగఁ బాండునృపతనూభవులు
ఏ వెంట దుఃఖితులెంతయునయిరి;
వారితోఁ బగగొనవల. " దనిబుద్ధి
నేరుపుతోఁ జెప్పి నెఱి సుయోధనుని
శాంతునిఁగావించి సకలాప్తనీతి
వంతులమాటలు వదలకవినుచు

  1. సంకోశంబుతోడ.
  2. చాపలత్వము. (మూ)