పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/672

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

606

ద్విపద భారతము.


నిజముచెప్పకయున్న నీమస్తకంబు
త్రిజగములెఱుఁగఁగ దివిజాధినాథు
కులిశంబువ్రచ్చు [1]నికుంఠితంబుగను
నెలవుమై." ననినఁ బ్రహ్లాదుండు వెఱచి
కశ్యపుకడ కేఁగి కమనీయనీర
జాస్యుఁడై పల్కె. యథార్థంబుగాను.
తగవిరోచనుని సుధన్వుని పలుకు
లొగిఁ దెల్పఁ గశ్యపుఁ డుచితోక్తిఁబలికె :
"సాక్షిదప్పఁగఁ జెప్పజాలినవారు
తత్ క్షణంబున మహీస్థలిలోని వరుణ
పాశబద్ధులనంగఁ బరఁగుదురెందు ;
దేశంబులందును దృఢముగా మఱియు
నన్యాయసభలోన నతులధర్మంబు (?)
విన్యాససభయందు వెలయదుగాన,
ధర్మంబు సభ్యులు దప్పకుండంగ
నిర్మలమతి నెందు నెఱిఁజెప్పవలయు."
ననినఁ బ్రహ్లాదుండు నతనికిట్లనియెఁ :
"దనర సుధన్వుండు నాతనయునికంటె
నుత్త ముం." డనిచెప్పియుఁడి మెప్పించె.
నత్తఱిఁ గశ్యపుఁ డాసుధన్వుండు
నరిగిరి ప్రహ్లాదు నభినుతింపుచును
బరమవిజ్ఞానులై పాటించిమించి.
మీరు ద్రౌపదియందు మెఱయ ధర్మంబు
గోరి [2]సెప్పు." డటన్నఁ గొలువువారెల్లఁ
బలుకకుండిరి; యంతఁ బాంచాలిపలికె:
"నలఘుమదీయస్వయంవర వేళఁ

  1. నంకురితంబుగాంగ.
  2. సేయు. (మూ)