పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/671

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

605


నీవికర్ణుఁడు నిర్జ రేశ్వరగురుని
భావంబులనుబోలు బహుళనీతులను
బాలుఁడై యుండియుఁ బరమధర్మంబు
చాలంగబలికెఁ బాంచాలిపట్టునను ;
[1]అతులితంబైనట్టి న్యాయంబుగాన
నతనివాక్యంబు మీరటుసేయఁదగును;
ధర్మజ్ఞులై సభాస్థలికిని వచ్చి
ధర్మసందేహ మత్తఱి నడ్గినపుడు,
నిజము చెప్పక యున్న నిఖిలభూస్థలిని
భజనతో ననృత సద్భయముల నెపుడు
పొందుచుండుదురు సత్పురుషులై మిగుల
నిందయేమియులేక నెయ్యంబునందు ;
ధనలోభమునను సంతతమును సభను
ననృతవాక్యములాడినట్టి సభ్యులకు
సిద్ధించుఁ బాపంబు శీఘ్రంబుగాను ;
ఇద్ధర నీయర్థ మితిహాసములను
వినఁబడెఁ; బ్రహ్లాదవిబుధారిసుతుఁడు
జననుతుండగు విరోచనుఁడును, ధన్యుఁ
డగుసుధన్వుడు, నొక్కయలివేణికొఱకుఁ
దగ బ్రతిగ్రహము మోదంబునఁ జేయ
నేమెపెద్దలమని యిద్దరుఁగూడి
మోమోటమాని యిమ్ములఁబోరుచుండి
ప్రహ్లాదుకడ కేఁగి పస సుధన్వుండు
నాహ్లాదచిత్తుఁడై యప్పుడిట్లనియె:
"ధర్మవిదుండవు తలఁపంగనీవు
అర్మిలిమావాదమటుదీర్పవలయు ;

  1. తతు ........ ధర్మంబు ? (మూ)