పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/666

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

600

ద్విపద భారతము.


పాంచాలిఁ గల్యాణిఁ బణముగా నొడ్డె
నంచితంబుగ [1] నొకఁ; డట్టిద్రౌపదిని
ధర్మవర్తనిఁ బుణ్యతరుణీలలామ
నిర్మలమానస నీరజపంక
బింబాధరోష్ఠిఁ బుష్పిత నేకవస్త్రఁ
గంబుకంఠిని నధికక్రోధమునను
దక్కక యీసభాస్థలములోపలికి
నక్కట నీ తోడ్తేరనర్హమా?" యనిన
నావికర్ణుని పల్కులన్నియు వినఁగ
నోపక కర్ణుఁడత్యుగ్రుఁడై పలికె:

కర్ణుఁడు వికర్ణునిఁ గినియుట

"కురువృద్ధు లధికులు గుణవంతులుండ,
వరుసతోడుతఁ బిన్నవానికి నీకు
నిట్టిమాటలుపల్క నేమికారణము?
నెట్టణంబుగ దయానిపుణత్వమునను.
ద్రౌపది [2]యత్యంతధర్మచరిత్ర
యేపార ననిపల్కి తీవు నెయ్యమున;
శమనతనూజుండు సకలలక్ష్ములను
గ్రమమున నోడుచోఁ గాంతఁ బాంచాలి
నేటికినోడె మహీస్థలంబెఱుఁగ!
మాటికి నిటువంటిమాటలు మాను;
'యేకవస్త్రముతోడియేణాక్షి దీని
నీకొలువునకుఁ దా మేభంగులందు
రప్పించినా! రిదిరౌద్రంబుతోడఁ
దప్పఁజేసితి.' రని తడయకాడితివి;

  1. గాననాద్రౌపదియును (మూ)
  2. అధర్మవిజితయని. నన్నయ. సభా. ద్వి. అ. 229. గ.