పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/662

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

596

ద్విపద భారతము.


మును [1]బలాత్కారమ్మునను గొనిపోవఁ
జనునె నీకును రాజసభలోపలికిని!"
అంచునుబలికిన, నాగ్రహంబునను
వంచనలేక దుర్వారసత్వమున
దురితశరీరుండు దుశ్శాసనుండు
తరుణి నుత్తమసాధ్వి ద్రౌపదీ దేవి
నతిరాజసూయమహాధ్వరాంతమునఁ
జతురావబృథమున జగతీసు రేంద్ర
వేదమంత్ర పవిత్ర విమలోదకములఁ
బ్రోదిఁ బావనములై పొలుపారునట్టి
యసమానపుశిరోరుహంబులదానిఁ
దలపట్టి యీడ్చి యుద్దండతఁ దెచ్చె
నోడక సభకు నార్యులు చింతతోడఁ
జూడంగ నధికనిష్ఠురవృత్తి మీఱ.
గాలిఁదూలినయట్టి కలితపతాక
వోలె దుశ్శాసనుభూరిహస్తమునఁ
బట్టంగఁబడి కృష్ణ [2]పటుకీరవాణి
నెట్టన భీతితో నెఱిఁ గర్ణశకుని
సైంధవ కురురాజ సభకునేతెంచి
బంధురకోప నిర్భరలజ్జలందు
నాసభవారికి నప్పుడిట్లనియె:
"రాశికెక్కిన ధర్మరాజు ధన్యుండు
దైవయోగమునజూదంబున [3]నొడ్డి
భావింప నటయోటుపడియుండుఁగాక ;
ధర్మంబుదప్పునే తనువుపోయినను !
ధర్మాత్ములార, సత్యవ్రతులార,

  1. బలవత్కారమున.
  2. పటికీర్ణవేణి.
  3. నోడి. (మూ)