పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/649

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

583


గురు భీష్మ కృప శల్య కుంభజపుత్త్ర
సరసిజహితసూను సౌబలాదులును
ధృత రాష్ట్రవిదురులు తేజంబునందు
ధృతిఁజూచుచుండిరి తెరలకయచట.
బద్ధమత్సరుఁడై ప్రభావంబునందు
సిద్ధంబుగా యుధిష్ఠిరుఁడు నయ్యెడను
గనకనిష్కంబులు, ఘనపురంబులును,
అనుపమ దివ్యవస్త్రానీకములును,
మరకత హరినీలమణి పద్మరాగ
వరవజ్ర మౌక్తిక వైడూర్య పుష్య-
రాగ గోమేధిక రత్న ప్రవాళ
నాగేంద్రమణులు, భాండాగారములును,
గలిత పంచద్రోణ కాంచనసహిత
[1]నలినమందిరపూర్ణ నవనిధానములు,
మాణిక్య కింకిణీమాలికానేక
బాణ తనుత్రాణ బహురూపములును,
ధన్యవరూధయూధములు, సువర్ణ
మాన్యఘంటాధ్వాన మదసింధురములు,
నమిత వినూత్న రత్నాభరణములుఁ,
గమనీయ నిజసభాగ్ర సమగ్రపాత్ర
పాణులై యొప్పెడు పరిచారకులును,
క్షోణీధరారాతి సుతునకు చిత్ర
........ ........ ........ ....... .......
........ ........ ........ ........ ..........
అజ మేష గో మహిషానీకములును,
రజతపాత్రంబులు, రత్నాంబరములు,

  1. పద్మాదినవనిధానములని కాఁబోలు కవియూహ.