పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/646

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

580

ద్విపద భారతము.


నీకునుసేమంబు నెఱయ నెయ్యెడను
ఆకల్పముగ." నన్న నాధర్మజుండు
విదురునిఁబూజించి వేడ్కనిట్లనియె:
“పదవినున్నారము పరఁగనందఱము ;
నీవువచ్చినపని యెఱిఁగింపునాకు
నీ వేళ.” యన నతండిట్లనిపలికె :
“తనసభఁజూడ జూదంబాడ నీవు
చనుదేరఁ బుత్తెంచెఁ జయ్యన నన్ను."
అనుటయు ధర్మజుండటువిచారించి
పనివడి ధృతరాష్ట్రుపంపు మాకిపుడు
చేయకపో రాదు చెనసియింకనుచు
నాయతవిధియుక్తుఁడై క్షణంబునను
అనుజులుఁ దానును ఆద్రౌపదియును
ఘనుఁడుదౌమ్యుండాదిగా బుధశ్రేణి
యే తేర నిభపురి కేఁగె నెయ్యమున.
నాతఱి భీష్ము ద్రోణాచార్యు శల్యుఁ
గృపుని నశ్వత్థామఁ గీర్తిభానుజునిఁ
దపన తేజునిసుయోధను భక్తిఁజూచి,
యాసభాస్థలియందు నాధృతరాష్ట్రు
భాసురయశునిఁ [1]బ్రతాపవర్తనుని
గనుఁగొనఁ దారకాగణములలోన
నొనరిన రోహిణీయుత సుధాకిరణుఁ
డుండినకైవడి నొప్పు గాంధారి
పుండరీకాక్షి సంపూర్ణేందువదన
తోడుగ సుఖలీలదొరయంగనున్న
ప్రోడను రాజన్యపుంగవుఁ జూచి

  1. భాత. (మూ)