పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/645

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

579


ఒడఁబడి విదురుని నొప్పరావించి
తడయకిట్లనిపల్కెఁ దప్పకయుక్తి :
"సౌవర్ణ నవరత్నసభ యిదిచూడఁ
బావనమతియైన పాండవాగ్రజునిఁ
దమ్మలఁ దోతెమ్ము తగిలియిచ్చటికి ;
నిమ్ముల జూదంబు నీకురురాజు-
తోడ నాడంగ బంధురముగా వలయు
వేడుక." ననవుడు విని విదురుండు
చకి తాత్ముఁడై మదిఁ జాలఁజింతించి :
"యకట యిట్లేల ! మాయాద్యూతమాడ
నుభయపక్షమువారి కుగ్రవైరంబు
త్రిభువనంబెఱుఁగంగఁ దెల్లమినగును."
......... ......... ........ ......... .........

విదురుఁడు ధర్మజుఁదోడ్తెచ్చుట

అని పెక్కుమాఱులు నతనిఁబ్రార్థించి
చెప్పిన, వినకున్నఁజేసి యావిదురుఁ
డప్పుడు ధృతరాష్ట్రుననుమతంబునను
బోయె నింద్రప్రస్థపురవరంబునకు.
నాయెడ ధర్మజు [1]హరిని భీమునిని
విజయుని గవలను వేడుకఁజూచి,
నిజమతిఁజింతించి నెఱిధర్మజునకు
భయభక్తియుక్తితోఁ బరఁగనిట్లనియె:
"జయమెనీకును సరేశ్వర, మిక్కిలియును
పుణ్యాత్ముఁడవు గుణాంబుధివి లోకమున
గణ్యయశుండవు కారుణ్యనిధివి

  1. ద్యూతాహ్వానమునకై విదురుఁడుపోయినపుడు, పాండవులయొద్ద కృష్ణుఁడున్నట్లు వ్రాయుట, వ్యాస నన్నయ భారతవిరుద్ధము.