పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/642

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

576

ద్విపద భారతము.


ఇందులకును మీరలేఁగుదేరంగ
నందున నేనుండి యాసభమహిమ
[1]చూచుచు, నచటి సంశోభితరత్న
వైచిత్రిభావించి వదలకమగుడి
మానిత విమలసన్మణితలంబునను
గానక యే తేరఁ గటిశాటిదడియ,
ననుజూచి భీముండు నగియె మిక్కిలిని.
కని ధర్మజుఁడు, నాకుఁ గనకాంబరములు
పుత్తెంచినను ముదంబున ధరియించి
తత్తరంబున మణిద్వారకవాట
దేశంబు వీక్షించి ధృతి లోనికరుగ,
నాశశికాంత శిలాగ్రంబుదాఁ
నాలలాటమునొవ్వ, నను బిట్టునవ్వె
బాలాజనంబు లపారంబుగొల్వ
ద్రౌపది రూపసౌందర్యగర్వమున.
ఆపట్టునను ద్రోవయరయంగలేక
బ్రమసి యేనుండంగఁ, బఱతెంచి కవలు
కమనీయ రాజమార్గంబిది యనుచుఁ
దోకొనిపోయిరి; దొరయంగ నట్టి
శ్రీకరసభఁజూచి సృష్టిలోపలను
బ్రాణంబుతోడను బ్రదుకంగఁజాలఁ.
ద్రాణతోఁ బెద్దలు తద్దయు మిగుల
నవమానమొందిరి; యధములందఱును
బ్రవిమలశ్రీలతో బహుమానములను
బొందిరి యేను భూభువనమెఱుంగఁ;
గుందుచున్నాఁడను గురుతరంబుగను.
.......... .......... ........ ......... .......
.......... .......... .......... ......... .......

  1. చూచునప్పటికి. (మూ)