పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/641

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

575


ఘనతమీఱంగఁ దాఁగట్టించినట్టి
కనకసన్మణిసభ కౌరవేంద్రునకుఁ
జూపి యతనితోడ సొలవకిట్లనియె:
"నాపదయగుజూద మాడంగవలదు;
కలహంబు మీలోనఁ గలయంగఁబుట్టు;
నిలఁ బ్రజాక్షయమగు నింతమీఁదటను
నీవుఁ బాండవులును [1]నెయ్యంబుగలిగి
వావిరి సుఖలీల వర్తించుటొప్పు;
వలదుజూదంబాడ ; వారిలక్ష్ములకు
నిల నసహింపంగ నేటికినీకు?
పాపంబుగట్టుకోఁ బాఁడియే నీకు !
నోపికగలిగుండు ముచితయత్నముల ;
వేదార్థవిదుఁడైన విదురున కిదియ
యేదియు సమ్మతంబెంతయుఁ గాదు ;
ధర్మనందనుసంపదకు నెక్కుడైన
భర్మంబు నీకును బసఁ జాలఁగలదు ;
అతఁడుచేసినయట్టి యజ్ఞంబుకంటె
నతివిశేషంబుగా యజ్ఞంబుసేయు ;
భూలోకమునఁగలభూపతులెల్లఁ
జాలంగ సంపద చయ్యనఁదెచ్చి
యిత్తురునీ." కన్న నిలనాయకునకు
నత్తఱిఁ గురుపతి యల్లనఁబలికె :
"ధర్మజుతోడ జూదంబులాడుటయె
ధర్మయజ్ఞము నాకు ధరణీతలేశ !
అందుమూలంబున నఖిలసంపదలుఁ
జెందునునాకుఁ బ్రసిద్ధంబుగాను.

  1. నేమంబులకును. (మూ)