పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/640

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

574

ద్విపద భారతము.


తగఁ [1]గలిద్వారసందర్భంబునగుట
జగడంబు జూదంబు సత్ప్రజాక్షయముఁ
గాఁగలవని మదిఁ గడిమితోనెఱిఁగి,
లోఁగుచు నృపునకాలోన నిట్లనియె:

జూదమాడఁదగదని విదురునుపదేశము

"ఇట్టికార్యమునకు నేనొడఁబడను ;
బుట్టును మీఁదను భూరివైరంబు.
పుత్త్రులకెల్లను బోరాటమేల
ధాత్రిఁజేసెదవు చిత్తంబుననెఱిఁగి !
ఇదిమీఁద నొప్పదు ఎన్నిభంగులను;
వదలక జూదమేవలన నాడినను
ఎట్టిశాంతులకైన నీసులువుట్టు;
గట్టిగా నీనేర్పుకలిమి నీశకుని
కురుమహీపతుల దుర్గుణములువాపి
కురువంశమెల్లను గోరి రక్షింపు.”
మన విదురునిఁజూచి యారాజుపలికెఁ :
“దనయుల కేల యుద్ధముసంభవించు ?
నీవును నేనును నీతి [2]మంతులగు
పావన భీష్మకుంభజులుండఁగాను ;
అటుగాన యిందుల కనుకూలమొందుఁ;
దటుకున నీవు రథంబెక్కిపోయి
ధర్మనందనుని మోదమునఁ దో తెమ్ము
పేర్మితో." ననిపంపఁ బెద్దయు నతఁడు
నేకాంతమున భీష్నుకెఱిఁగించియుండె,
ప్రాకటంబుగ ధృతరాష్ట్రుఁడంతటను

  1. కలిప్రవేశసమయమని కాఁబోలు కవియూహ! 'కలి ద్వాపరసమీపంబగుటయు.' అని. నన్నయ.
  2. వంతుండు. (మూ)