పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

571


యభిషేక మొనరించె నతినిచిత్రముగఁ.
బ్రభ నభిషిక్తుఁడై పరఁగినయట్టి
సత్యసంధుఁడు ధర్మజమహీశునకును
సాత్యకి మౌక్తికచ్ఛత్రంబుపట్ట,
భీముండుఁ బార్థుండుఁబ్రేమంబుతోడఁ
జామరంబులు విశేషంబుగా నిడిరి;
కమలనాభుండును గవలును ద్రుపదు
కొమరుండు వేర్వేఱ కువలయేశ్వరుల
మ్రొక్కింపుచుండిరి మోదంబునందు ;
దిక్కులరాజులుఁ దెఱఁగొప్ప నేను
జిన్నఁబోయున్నను చేష్టలెఱింగి
వెన్నుండు పాండుభూవిభుతనూజులును
ద్రౌపది సాత్యకి దగుసంతసమునఁ
జూపట్టియుండి; రచ్చో యుధిష్ఠిరుఁడు
నెనయంగ నెనుబదియెనిమిదివేలు
ఘనమహీసురులకుఁ గల్యాణమొప్పఁ
జేసి, ప్రత్యేకంబు చెలఁగి ముప్పండ్రు
దాసుల వేర్వేఱ తడయకయిచ్చి,
పదివేలు వేదవిప్రవ్రాతములను
బదవికెక్కిన హేమపాత్రంబులందు
భుజియింపఁగాఁజేసి, భూషణవ్రజము
నిజవస్త్రములు గంధనివహంబు నొసఁగి
[1]మన్నించియుండును మహనీయరుచుల.
నెన్నంగ నాజన్మమేమిఫలంబు!
పాండునందనుల సంపదలుచూడంగ
మండలంబుననోర్వమఱి " యనుటయును
శకునియిట్లనియె నిశ్చలవృత్తితోడ :
"నకలంకమగుచున్న యయ్యక్షవిద్య

  1. మన్నింపుచుండును. (మూ)