పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/636

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

570

ద్విపద భారతము.


నుడుగకమ్రోసెఁ బెంపొదవి శంఖంబు.
అడరి జన్నముచూడ నరుదెంచినట్టి
సర్వభూములమహీశ్వరుల భూసురుల
దుర్వారవైశ్య శూద్రుల నాప్తజనులఁ
బ్రాణబంధువులను బ్రాణిసంఘముల
క్షోణిపైఁ బేదల సుజనుల నరిసి
ప్రతిదివసంబును భాసురాన్నములు
చతురత్వమునఁబెట్టి సంతోషమునను
అర్ధ రాత్రంబున నన్నంబుగొనును
అర్ధేందుధరుకృప నాద్రౌపదియును.
అధికుఁడాధర్మజునధ్వరంబునను
అధమాధముండును అధికపూజ్యతను
బొందుఁ ; [1]గానప్రియంబును బొందఁడెందు.
ముందు హరిశ్చంద్రు మూర్థాభిషిక్తుఁ
డరుదుగా రాజసూయాధ్వరంబొప్ప
సరవిఁజేసెను; గాని, చర్చించిచూడ
ధర్మనందనుమహాధ్వరముతో నదియుఁ
బేర్మితో సరిగాదు పృథివిఁ దర్కింప.
ఆయాగదీక్షితుండై ధర్మసుతుఁడు
పాయక ధారుణీపతులు భూసురులుఁ
[2]దిరుగువాఱి భజింప దిక్పతిశ్రేణి
వరుసఁగొల్వఁగనున్న వాసవుఁబోలె.
ధర్మనందనుఁడు మోదముఁబొందియుండ,
ధర్మమూర్తులు మునీంద్రసముత్కరంబుఁ
గొనియాడ, ధౌమ్యుఁడు గోచరతీర్థ
ఘనజలంబులను యోగ్యంబుగాఁ బూని

  1. కాని+అప్రియుము.
  2. తిరుగ. (మూ)