పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/635

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

569


భగదత్తుఁడాదిగాఁ బార్థివోత్తములు
నగణిత గోమహిషాశ్వదింతులను
అజముల రథముల సంబరంబులను
నిజభూషణంబుల నీరజాననలఁ
దెచ్చియిచ్చిరి యాయుధిష్ఠిరునకును.
అచ్చుగా మఱియును నపరిమితంబు
రత్న కాంచనముల రాజీవముఖుల
రత్న సాను ధరాధరశ్రేష్ఠ తుహిన
గిరి ముందరాచలక్ష్మితితలేశ్వరులు
కురు కుసుమాసవ కోమలపాత్ర
దివ్యౌషధంబులు దివ్యాంబరములు
[1]దివ్యేంద్రనీల సుస్థిరచంద్రకీర
మరకతవర్ణసుమానితహరులు,
వరమౌ క్తిక చ్ఛత్ర వర్ణితతల్ప
చామర దివ్యాస్త్ర సముదయంబులును,
గోమలంబగుపట్టు గొలైనగములు
నిచ్చిరి ధర్మజు కింపుసొంపారఁ ;
జెచ్చర గంధర్వచిత్రరథుండుఁ
దుంబురుండునుగూడి దొరసి నూఱేసి
కంబువర్ణములైన గంధర్వహరుల
మహిమతోనొసగిరి మహనీయముగను;
బహుభంగి నందుకై పరఁగఁజిక్కితిని.
ఒకలక్షభూసురు లొగి భుజియింప
సకలయత్నములందు శంఖంబుమ్రోయుఁ
దనకుఁదాన సమంచితంబుగానెపుడు;
మునుమిడి యాగంబు ముగియునన్నాళ్లు

  1. దివ్యవీతేంద్ర సుస్థిర చంద్రకీర్ణ-మరకతవస్త్ర సమానితహరులు. (మూ) 'ఇంద్రనీల....పిక చంద్ర... కీరవర్ణతురంగంబులను, , అని. నన్నయ, సభా. ద్వి. ఆ. 113గ.