పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/632

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

566

ద్విపద భారతము.


మని శకునియు వేగ మాసుయోధనునిఁ
గొనిపోయి ధృతరాష్ట్రకువలయేశ్వరుని
సన్నిధినిలిపి నిశ్చలవృత్తిఁ బలికె :
"నెన్నికకెక్కిన యాసుయోధనుఁడు
నీకుమారుఁడు ధారుణీనాథుఁ డాత్మ
వైకల్యమునను వివర్ణమునిందుఁ
బొందియున్నాఁడు పెంపున విచారింపు
ముదంబుగా." నన్న నాధృతరాష్ట్ర
ధరణీశుఁ డాసుయోధనుశరీరంబు
పరికించినిమిరి తత్పరబుద్ధిఁబలికె:
"శాశ్వతైశ్వర్యంబు సకలలక్ష్ములును
విశ్వంబులోపల వెలయంగఁగలవు ;
అనుజులు మిత్రులు నఖిలబాంధవులు
ననుకూలురై యుందు రనిశంబునీకు;
నింద్రునికంటెను నెక్కుడైనట్టి
సాంద్రభోగము నీకుఁ జాలంగఁగలదు ;
సకలభూపతులును సతతంబు భక్తి
ప్రకటంబుగాఁగ నీపంపుసేయుదురు.
ఏమితక్కువనీకు నెల్లసౌఖ్యముల !
నీమేనుడస్సిననిర్ణయంబేమి ?
నిజదేహకాంతులు నీ కేలదఱిగె?
......... .......... .......... .......... ............
[1]సరసత్వమున నీవు సకలసామ్రాజ్య
పరభారకముదప్పి పరఁగియుండితివి. "
అనవుడు ధృతరాష్ట్రుకాతఁడిట్లనియె:

  1. 'సకలధరణిరాజ్య భోగసుఖపరాఙ్ముఖత్వముఁ బొంద నేల.' అని నన్నయ. సభా. ద్వి. అ. 102. ప. నన్నయభారతముననుకరించియు, నీరసిల్లఁజేసిన రచనా భాగము లిట్టివింకను గలవు.