పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

558

ద్విపద భారతము.


నాతోడ వడిఁ బ్రథనము సేయు నిలిచి
యీతఱి.” ననుచును నెగ్గులుపలుకు
శిశుపాలుఁగనుఁగొని శ్రీకృష్ణుఁడనియె
విశదోక్తులను మహీవిభులువినంగ :
"అమరఁ బ్రాగ్జ్యోతిషంబనుపురంబునకుఁ
బ్రముదితంబుగవచ్చి భగదత్తుతోడఁ
బోరాడ నీచేదిభూపతి పోయి
ద్వారకానగరంబు దగ్థంబుచేసెఁ
గ్రూరుఁడై యన్యాయ [1]కుశలతఁబేర్చి,
భూరివిక్రములగు భోజరాజాది
ధారుణీశులు [2]రైవతనగంబునందుఁ
జారుతరంబగు స్మరపరవశతఁ
బొలఁతులతోఁగూడి భోగింపుచుండఁ
దెలిసి నారలను వధించె నేకతమ;
దేవాభుఁడగు వసుదేవుండుసేయు
పావన హయమేధ పటుమఖంబునకు
నర్చితంబైనట్టి హయమును గొనియెఁ ;
బేర్చి యామఖముకుఁ బెరిమ విఘ్నంబు
చేసె వీఁడతిపాపశీలుఁడై పూని;
భాసురమతియైన బభ్రునిభార్యఁ
దనకుభార్యనుజేసె దర్పంబుతోడ ;
ననురక్తి మా మేనయత్త తాఁబలుకు
మాటకునై నూఱుమాఱులు వీని
మాటలకోర్చితి మఱి వీనిఁద్రుంతు."
ననుటయు శిశుపాలుఁ డబ్జాక్షుకనియె:
"నొనరంగ నీకూర్మియును నీదుపలుకు

  1. కులశత.
  2. రైవతానగంబునను. (మూ)