పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/622

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

556

ద్విపద భారతము.


బంధుర దైతేయభావంబుతోడ ;
సంధిల్లుటయుఁ, జూచి జననియు గురుఁడు
నరుదంది భయమంది యట్లున్నఁ, జూచి
వరుస నక్కడ నభోవాణి యిట్లనియె:
'నొరులు వీనినిజంప నోపరెవ్వరును ;
దొరయంగ వీనినెత్తుకయుండువేళ
నెవ్వరిచేత నీయెక్కుడుకన్ను
నివ్విశాలభుజంబు లివిరెండు నణఁగు,
నతనిచే శిశుపాలుఁడణఁగు గ్రక్కునను
జతురంబుగా; ' నని సర్వంబుఁ దెలిపె.
అదినిమిత్తంబుగా నాకుమారకుని
వదలక చూడంగవచ్చువారలకు :
'బాలుండువీఁడె నాపట్టి; ముద్దాడుఁ
డోలిమై.' నన వార లొదవినప్రీతి
నెత్తుక ముద్దాడి యింపుసొంపలర
బత్తితోఁ జేతికి ఫలములనొసగి
వారి [1]యూరికిఁజన, వసుధ నీవార్త
బోరనవిని యదువుంగవులైన
భీమవిక్రములు గంభీరనాయకులు
రామకృష్ణులు నిందురవితేజు లపుడు
అమరంగ జయశీలు నాశిశుపాలు
సుముఖులై వేడుకఁజూడంగఁ గోరి
పోయిరి బుధబంధుపుంజంబుతోడ.
ఆయెడఁ దన మేనయత్త సాత్వతియు
బాలకుండగు శిశుపాలునిఁదెచ్చి
చాలంగ సంతోషజనితయై యపుడు

  1. వారికి. (మూ)